Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 170 స్టాక్‌తో లాభాలకు ఛాన్స్..
Stocks to buy today : జూన్ 19, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 254 పాయింట్లు పెరిగి 77,410 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 82 పాయింట్లు వృద్ధిచెంది 24,168 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 379 పాయింట్లు పెరిగి 57,964 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,025.20 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,516.81 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 191 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.14 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.08శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.91 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పందం అనంతరం చమురు ధరలు పడుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ 0.84శాతం పడి బ్యారెల్‌కి 79.18 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
మీషో- బై రూ. 170, స్టాప్ లాస్ రూ. 167, టార్గెట్ రూ .176
అదానీ టోటల్ గ్యాస్- బై రూ. 720, స్టాప్ లాస్ రూ. 700, టార్గెట్ రూ. 750
అదానీ ఎంటర్ప్రైజెస్- బై రూ. 3031, స్టాప్ లాస్ రూ. 2980, టార్గెట్ రూ. 3080
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఇజెర్సాల్-రాండ్- బై రూ. 4715, స్టాప్ లాస్ రూ. 4493, టార్గెట్ రూ. 5050
అనూప్ ఇంజినీరింగ్- బై రూ. 2218, స్టాప్ లాస్ రూ. 2085, టార్గెట్ రూ. 2400
అక్యుటాస్ కెమికల్స్- బై రూ. 3136, స్టాప్ లాస్ రూ. 2962, టార్గెట్ రూ. 3232
వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్- బై రూ. 1482, స్టాప్ లాస్ రూ. 1422, టార్గెట్ రూ. 1600
క్రిసిల్- బై రూ. 1238, స్టాప్ లాస్ రూ. 1173, టర్గెట్ రూ. 1333
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


