Stock market : 80 డాలర్ల దిగువకు చమురు ధర- ఈరోజు స్టాక్ మార్కెట్లకు లాభాలా? నష్టాలా?
Stocks to buy today : జూన్ 23, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 291 పాయింట్లు పెరిగి 77,094 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 90 పాయింట్లు వృద్ధిచెంది 24,103 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 250 పాయింట్లు పెరిగి 57,936 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 635.91 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,035.72 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 23,700 లెవల్స్ బ్రేక్ చేయనంత వరకు బై ఆన్ డిప్స్ స్ట్రాటజీని అనుసరించాలని సూచిస్తున్నాము. సూచీకి 24,450- 24,600 లెవల్స్ వద్ద రెసిస్టెన్స్ ఉంది. బ్యాంకింగ్, ఆటో, రియాల్టీ, ఫార్మా, డిఫెన్స్ రంగాల్లో స్టాక్స్‌ని ఎంచుకోవచ్చు. ఐటీ స్టాక్స్‌లో లాంగ్ పొజిషన్స్‌ని పెట్టుకోకపోవడం ఉత్తమం,” అని రెలిగేర్ బ్రోకింగ్‌కి చెందిన అజిత్ మిశ్రా తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.29 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.3శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.32 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ముడి చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ 0.19శాతం పెరిగి బ్యారెల్‌కి 78.05 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
భారత్ ఫోర్జ్- బై రూ. 2104, స్టాప్ లాస్ రూ. 2030, టార్గెట్ రూ. 2250
అదానీ గ్రీన్ ఎనర్జీ- బై రూ. 1550, స్టాప్ లాస్ రూ. 1500, టార్గెట్ రూ. 1650
వరుణ్ బేవరేజెస్- బై రూ. 513, స్టాప్ లాస్ రూ. 500, టార్గెట్ రూ. 540
జిందాల్ స్టీల్- బై రూ. 1132, స్టాప్ లాస్ రూ. 1110, టార్గెట్ రూ. 1170
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
పృథ్వీ స్పెషాలిటీ కెమికల్స్- బై రూ. 3656, స్టాప్ లాస్ రూ. 3470, టార్గెట్ రూ. 4025
మహీంద్రా లాజిస్టిక్స్- బై రూ. 370, స్టాప్ లాస్ రూ .354, టార్గెట్ రూ. 400
ఆదిత్య బిర్లా క్యాపిటల్- బై రూ. 392, స్టాప్ లాస్ రూ. 374, టార్గెట్ రూ. 425
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


