Stock market : ఎట్టకేలకు కుదిరిన శాంతి ఒప్పందం.. స్టాక్​ మార్కెట్​లకు జోష్- ఈరోజు భారీ లాభాలు!

Stocks to buy : జూన్ 15,2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 15, 2026, 08:21:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1695 పాయింట్లు పెరిగి 75,528 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 461 పాయింట్లు వృద్ధిచెంది 23,623 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1638 పాయింట్లు పెరిగి 56,815 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్​ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్​ అప్డేట్స్..

కాగా అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని, హర్ముజ్​ జలసంధి తెరుచుకుంటుందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చేసిన ప్రకటనతో చమురు ధరలు పడ్డాయి. ప్రపంచ స్టాక్​ మార్కెట్​లకు జోష్​ లభించింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,082.18 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,341.29 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

టెక్నికల్ ఎనలిస్టుల ప్రకారం.. నిఫ్టీ50 సూచీ కీలక 23,000 జోన్​ని కాపాడుకోగలిగింది. అక్కడి నుంచి పెరిగింది. ఇంకా వృద్ధిని నమోదు చేయాలంటే కీలక 50-ఈఎంఏ లెల్​ 23,800 దాటాలి

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.70 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.50శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.31 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పందం నేపథ్యంలో బ్రెంట్​ క్రూడ్ ధర భారీగా పతనమైంది. ప్రస్తుతం దాదాపు 4శాతం పతనమై బ్యారెల్​కు 83.44 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- బై రూ 54, స్టాప్​ లాస్​ రూ. 52.40, టార్గెట్​ రూ. 58

ఎల్​ అండ్​ టీ ఫైనాన్స్- బై రూ. 272, స్టాప్​ లాస్​ రూ. 267, టార్గెట్​ రూ. 282

ఐఓసీ- బై రూ. 140, స్టాప్​ లాస్​ రూ. 137, టార్గెట్​ రూ. 148

బ్రేకౌట్ స్టాక్స్ టు బై..

కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్- బై రూ. 1890, స్టాప్​ లాస్​ రూ. 1800, టార్గెట్​ రూ. 2070

ఎఫ్​ఎస్​ఎన్ ఈ కామార్స్ వెంచర్స్- బై రూ. 273, టార్గెట్​ రూ. 295, స్టాప్​ లాస్​ రూ. 260

గ్రీవ్స్ కాటన్- బై రూ. 185, స్టాప్​ లాస్​ రూ. 175, టార్గెట్​ రూ. 200

బ్రిగేడ్ ఎంటర్​ప్రైజెస్- బై రూ. 678, స్టాప్​ లాస్​ రూ. 650, టార్గెట్​ రూ. 740

రెయ్మాండ్స్- బై రూ. 580, స్టాప్​ లాస్​ రూ. 555, టార్గెట్​ రూ. 630

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More