Stock Market : ట్రేడర్స్ అలర్ట్- ఎన్టీపీసీ, కోల్ ఇండియా షేర్ ప్రైజ్ టార్గెట్స్ ఇవే..
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 262 పాయింట్లు పెరిగి 77,764 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 95 పాయింట్లు వృద్ధిచెంది 24,271 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 93 పాయింట్లు పడి 57,939 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,355.33 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,953.89 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 6 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
అమెరికా స్టాక్ మార్కెట్లకు శుక్రవారం సెలవు. కాగా వివిధ సూచీల ఫ్యూచర్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర మరింత పడింది. బ్రెంట్ క్రూడ్ 0.33శాతం పతనమై 71.88 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
ఇండస్ఇండ్ బ్యాంక్- బై రూ. 974, స్టాప్ లాస్ రూ. 940, టార్గెట్ రూ. 1040
టొరెంట్ ఫార్మా- బై రూ. 4768, స్టాప్ లాస్ రూ. 4600, టార్గెట్ రూ. 5100
వరుణ్ బేవరేజెస్- బై రూ. 516, స్టాప్ లాస్ రూ. 505, టార్గెట్ రూ. 540
ఎన్టీపీసీ- బై రూ. 356, స్టాప్ లాస్ రూ. 345, టార్గెట్ రూ. 370
కోల్ ఇండియా- బై రూ. 439, స్టాప్ లాస్ రూ. 425, టార్గెట్ రూ. 456
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
పారాదీప్ ఫాస్ఫేట్స్- బై రూ. 146.5, స్టాప్ లాస్ రూ. 139.5, టార్గెట్ రూ. 160
మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్- బై రకూ. 334, స్టాప్ లాస్ రూ. 318, టార్గెట్ రూ. 360
ఓరియంట్ సిమెంట్- బై రూ. 146, స్టాప్ లాస్ రూ. 135, టార్గెట్ రూ. 155
పిరమాళ్ ఫార్మా- బై రూ. 176, స్టాప్ లాస్ రూ. 167, టార్గెట్ రూ. 190
యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ - బై రూ. 976, స్టాప్ లాస్ రూ. 930, టార్గెట్ రూ. 1060
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


