ట్రేడర్స్ అలర్ట్- ఎస్బీఐ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ ప్రైజ్ టార్గెట్లు ఇవే..
జనవరి 13, ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 302 పాయింట్లు పెరిగి 83,878 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 107 పాయింట్లు వృద్ధిచెంది 25,790 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 199 పాయింట్లు పెరిగి 59,450 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,638.4 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,839.32 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ జనవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 15,425.22 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 23,742.34 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 26,000- 26,100 రేంజ్ వద్ద బలమైన రెసిస్టెన్స్ ఉంది. అక్కడ అమ్మకాల ఒత్తిడి పెరగవచ్చు. 25,650 వద్ద సపోర్ట్ ఉంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవాం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.17 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.16శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.26 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
హోం ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా- బై రూ. 1062, స్టాప్ లాస్ రూ. 1025, టార్గెట్ రూ. 1136
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)- బై రూ. 1015, స్టాప్ లాస్ రూ. 980, టార్గెట్ రూ. 1085
డా. రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్- బై రూ. 1216, స్టాప్ లాస్ రూ. 1190, టార్గెట్ రూ. 1260
ఇన్ఫోసిస్- బై రూ. 1595, స్టాప్ లాస్ రూ. 1570, టార్గెట్ రూ. 1660
హెచ్డీఎఫ్సీ బ్యాంక్- బై రూ. 937, స్టాప్ లాస్ రూ. 920, టార్గెట్ రూ. 980
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్- బై రూ. 163.59, స్టాప్ లాస్ రూ. 157, టార్గెట్ రూ. 177
ఏషియన్ పెయింట్స్- బై రూ. 2896, స్టాప్ లాస్ రూ. 2800, టార్గెట్ రూ. 3100
నెస్లే ఇండియా- బై రూ. 1312, స్టాప్ లాస్ రూ. 1270, టార్గెట్ రూ. 1400
ఆల్కెమ్ లాబొరేటరీస్- బై రూ. 5867, స్టాప్ లాస్ రూ. 5656, టార్గెట్ రూ. 6300
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- బై రూ. 164, స్టాప్ లాస్ రూ. 157, టార్గెట్ రూ. 177
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


