బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 574 పాయింట్లు పెరిగి 82,605 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 178 పాయింట్లు వృద్ధిచెంది 25,324 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 303 పాయింట్లు పెరిగి 56,800 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 68.64 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,650.08 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ అక్టోబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 1,893.03 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 22,441.64 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 26 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50లో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది! 25,250-25,300 లెవల్స్ దగ్గర ఉన్న కీలక రెసిస్టెన్స్‌ని దాటేసింది. సూచీ ఇక్కడి నుంచి 25,500-25,600 లెవల్స్ వరకు వెళ్లొచ్చు. కిందకి పడితే మాత్రం 25,250 దగ్గర సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే స్వల్ప కాలంలో కరెక్షన్ కనిపించొచ్చు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.44 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.16శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.76 శాతం డౌన్ అయ్యింది.
{{/usCountry}}బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.44 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.16శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.76 శాతం డౌన్ అయ్యింది.
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా- బై రూ. 995, స్టాప్ లాస్ రూ. 950, టార్గెట్ రూ. 1070
ఆయిల్ ఇండియా- బై రూ. 423, స్టాప్ లాస్ రూ. 409, టార్గెట్ రూ. 450
ఏషియన్ పెయింట్స్- బై రూ. 2375, స్టాప్ లాస్ రూ. 2300, టార్గెట్ రూ. 2500
లుపిన్ లిమిటెడ్- బై రూ. 1940, స్టాప్ లాస్ రూ. 1910, టార్గెట్ రూ. 1980
ఆదిత్య బిర్లా క్యాపిటల్- బై రూ. 304, స్టాప్ లాస్ రూ. 290, టార్గెట్ రూ. 320
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
మనోరమ ఇండస్ట్రీస్: రూ.1537 వద్ద కొనండి, టార్గెట్ రూ.1650, స్టాప్ లాస్ రూ.1480;
ఆదిత్య ఇన్ఫోటెక్: రూ .1423 వద్ద కొనండి, టార్గెట్ రూ .1530, స్టాప్ లాస్ రూ .1370;
అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్: రూ .541 వద్ద కొనండి, లక్ష్యం రూ .580, స్టాప్ లాస్ రూ .522;
కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్: రూ .727 వద్ద కొనండి, రూ .780 టార్గెట్ , స్టాప్ లాస్ రూ .700;
టీడీ పవర్ సిస్టమ్స్: రూ.634 వద్ద కొనండి, టార్గెట్ రూ.680, స్టాప్ లాస్ రూ.610.