Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఎటర్నల్, విప్రో షేర్ ప్రైజ్ టార్గెట్స్ ఇవే..
Stock market : ఆగస్టు 17, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 71 పాయింట్లు పడి 78,009 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 30 పాయింట్లు కోల్పోయి 24,366 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 144 పాయింట్లు పడి 57,491 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 508.12 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 356.40 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 45 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.20 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.17శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.28 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితుల కారణంగా ముడి చమురు ధర ఎక్కువగానే ఉంది! బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 89 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
స్టాక్స్ టు బై..
హెచ్ఏఎల్- బై రూ. 5030, స్టాప్ లాస్ రూ. 4799, టార్గెట్ రూ. 5500
గోద్రేజ్ అగ్రోవెట్- బై రూ. 581, స్టాప్ లాస్ రూ. 560, టార్గెట్ రూ. 620
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్- బై రూ. 8920, స్టాప్ లాస్ రూ. 8850, టార్గెట్ రూ. 9100
ఎటర్నల్- బై రూ. 318, స్టాప్ లాస్ రూ. 310, టార్గెట్ రూ. 332
విప్రో- బై రూ. 184, స్టాప్ లాస్ రూ. 180, టార్గెట్ రూ. 192
ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్ సీఎంపీ- బై రూ. 298, స్టాప్ లాస్ రూ. 291, టార్గెట్ రూ. 320
ఎయిరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్- బై రూ. 459.8, స్టాప్ లాస్ రూ. 449, టార్గెట్ రూ. 485
హావెల్స్ ఇండియా- బై రూ. 1298, స్టాప్ లాస్ రూ. 1272, టార్గెట్ రూ. 1370
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఎస్‌జేఎస్ ఎంటర్ప్రైజెస్- బై రూ. 2532, స్టాప్ లాస్ రూ. 2380, టార్గెట్ రూ. 2750
హొనాసా కన్జ్యూమర్- బై రూ. 503, స్టాప్ లాస్ రూ. 466, టార్గెట్ రూ. 550
సువెన్ లైఫ్ సైన్సెస్- బై రూ. 342, స్టాప్ లాస్ రూ. 322, టార్గెట్ రూ. 370
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


