ట్రేడర్స్​ అలర్ట్​- ఐసీఐసీఐ బ్యాంక్​ స్టాక్​కి టైమ్​ వచ్చింది! షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 17, 2025 7:29 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 862 పాయింట్లు పెరిగి 83,468 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 262 పాయింట్లు వృద్ధిచెంది 25,585 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 623 పాయింట్లు పెరిగి 57,422 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 997.29 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,076.2 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ అక్టోబర్​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 895.74 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 26,517.84 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ సూచీలు ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“కీలక 25,500 రెసిస్టెన్స్​ లెవల్స్​ని నిఫ్టీ50 అదిగమించింది. ఇక్కడ నుంచి సూచీ 25,750- 25,800 వరకు వెళ్లొచ్చు. 25,500 సపోర్ట్​గా మారుతుంది,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ ఎనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.65 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.63శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.47 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

డా. అగర్వాల్స్​ హెల్త్​ కేర్​- బై రూ. 541.5, స్టాప్​ లాస్​ రూ. 523, స్టాప్​ లాస్​ రూ. 579

ఏథర్​ ఎనర్జీ- బై రూ. 688.5, స్టాప్​ లాస్​ రూ. 665, టార్గెట్​ రూ. 736

సెయిల్​- బై రూ .131, స్టాప్​ లాస్​ రూ. 125, టార్గెట్​ రూ. 140

ఎం అండ్​ ఎం- బై రూ. 3560, స్టాప్​ లాస్​ రూ. 3250, టార్గెట్​ రూ. 3750

కేపీఐటీ టెక్నాలజీస్​- బై రూ. 1162, స్టాప్​ లాస్​ రూ. 1140, టార్గెట్​ రూ. 1200

ఐసీఐసీఐ బ్యాంక్​- బై రూ. 1415, స్టాప్​ లాస్​ రూ. 1390, టార్గెట్​ రూ. 1470

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

పరాగ్ మిల్క్ ఫుడ్స్: రూ.286, టార్గెట్ రూ.305, స్టాప్ లాస్ రూ.275;

ప్రివి స్పెషాలిటీ కెమికల్స్: రూ.2744 వద్ద కొనండి, టార్గెట్ రూ.2940, స్టాప్ లాస్ రూ.2640;

హిండ్ వేర్ హోమ్ ఇన్నోవేషన్: రూ .371 వద్ద కొనండి, టార్గెట్ రూ .400, స్టాప్ లాస్ రూ .360;

రామ్కో సిస్టమ్స్: రూ.582, టార్గెట్ రూ.625, స్టాప్ లాస్ రూ.560;

ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్: రూ .2932 వద్ద కొనండి, టార్గెట్ రూ .3150, స్టాప్ లాస్ రూ .2828

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More