ట్రేడర్స్ అలర్ట్- రిలయన్స్ స్టాక్‌కి టైమ్ వచ్చింది! షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే..
ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 485 పాయింట్లు పెరిగి 83,952 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 125 పాయింట్లు వృద్ధిచెంది 25,710 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 291 పాయింట్లు పెరిగి 57,713 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 308.98 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,526.61 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ అక్టోబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 586.76 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 28044.45 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ రోజు స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉందా?
దీపావళి సందర్భంగా నేడు స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉందా? అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే, ఈరోజు స్టాక్ మార్కెట్ యథావిథిగా పనిచేస్తుంది! మంగళవారం ముహురత్ ట్రేడింగ్ సెషన్ ఉంటుంది. బుధవారం మాత్రం సెలవు ఉంది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 225 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50లో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది. ఒకవేళ కింద పడినా బై ఆన్ డిప్స్ స్ట్రాటజీని అనుసరించవచ్చు. 25,500 వద్ద సపోర్ట్ ఉంది. 25,850-26,000 వద్ద రెసిస్టెన్స్ ఉంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.52 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.53శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.52 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్- బై రూ. 936, స్టాప్ లాస్ రూ. 903, టార్గెట్ రూ. 1002
నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్- బై రూ. 913, స్టాప్ లాస్ రూ. 881, టార్గెట్ రూ. 977
ఇండస్ఇండ్ బ్యాంక్- బై రూ. 753, స్టాప్ లాస్రూ. 740, టార్గెట్ రూ. 770
రిలయన్స్ ఇండస్ట్రీస్- బై రూ. 1420, స్టాప్ లాస్ రూ. 1380, టార్గెట్ రూ. 1460
ఆదిత్య బిర్లా క్యాపిటల్- బై రూ. 300, స్టాప్ లాస్ రూ. 290, టర్గెట్ రూ. 320
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


