జనవరి 16 : ట్రేడర్స్ అలర్ట్- ఈ 10 స్టాక్స్‌తో లాభాలకు ఛాన్స్..
జనవరి 16, ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
ముంబై స్థానిక ఎన్నికల కారణంగా గురువారం స్టాక్ మార్కెట్లకు సెలవు. ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 245 పాయింట్లు పడి 83,383 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 67 పాయింట్లు కోల్పోయి 25,666 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 1 పాయింట్ పెరిగి 59,580 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,781.24 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,217.28 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ జనవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 21,706.27 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 30,141.4 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 25,800 రెసిస్టెన్స్‌గా ఉంది. 25,600 సపోర్ట్‌గా ఉంది. అది బ్రేక్ అయితే సూచీ మరింత పడొచ్చు. 25,500- 25,450 వరకు కూడా వెళ్లొచ్చు,” అని ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ అభిప్రాయపడ్డారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.6 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.2శాతం వృద్ధి చెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.25 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
ఎన్టీపీసీ- బై రూ. 349.10, స్టాప్ లాస్ రూ. 310, టార్గెట్ రూ. 380
పీఎన్బీ- బై రూ. 128.68, స్టాప్ లాస్ రూ. 122, టార్గెట్ రూ. 142
మాన్‌కైండ్ ఫార్మా- బై రూ. 2240, స్టాప్ లాస్ రూ. 2180, టార్గెట్ రూ. 2320
ఎల్టీ- బై రూ. 3868, స్టాప్ లాస్ రూ. 3800, టార్గెట్ రూ. 4050
సెయిల్- బై రూ. 152, స్టాప్ లాస్ రూ. 145, టార్గెట్ రూ. 162
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఇండస్ఇండ్ బ్యాంక్- బై రూ. 944.5, స్టాప్ లాస్ రూ. 899, టార్గెట్ రూ. 990
దాల్మియా భారత్- బై రూ. 2177.30, స్టాప్ లాస్ రూ. 2080, టార్గెట్ రూ. 2365
సెయిల్- బై రూ. 152.44, స్టాప్ లాస్ రూ. 145.50, టార్గెట్ రూ. 165
ఎన్‌హెచ్- బై రూ. 1946.10, స్టాప్ లాస్ రూ. 1860, టార్గెట్ రూ. 2110
కేఈఐ ఇండస్ట్రీస్- బై రూ. 4384.60, టార్గెట్ రూ. 4720, స్టాప్ లాస్ రూ. 4200
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












