Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఎస్బీఐ స్టాక్​కి టైమ్ వచ్చింది! షేర్ ప్రైజ్ టార్గెట్..

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 18, 2026, 08:15:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 347 పాయింట్లు పెరిగి 77,156 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 97 పాయింట్లు వృద్ధిచెంది 24,086 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 288 పాయింట్లు పెరిగి 57,585 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

కాగా.. ఓవైపు అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పందం, మరోవైపు ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు సంకేతాల వేళ ప్రపంచ స్టాక్​ మార్కెట్​లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 101.59 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,561.40 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 11 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 డైలీ ఛార్ట్​లో మైనర్​ అప్పర్, లోయర్​ షాడోలతో కూడిన చిన్న బుల్లిష్ క్యాండిల్ ఏర్పడింది. ఇది రేంజ్​ బౌండ్​కి సంకేతం. 24,100 లెవల్స్​ దగ్గర రెసిస్టెన్స్​ ఉంది. అది దాటితే సూచీ 24,500కి వెళ్లొచ్చు. మరోవైపు 23,900 వద్ద కీలక సపోర్ట్​ ఉంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.98 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 1.21శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.34 శాతం డౌన్​ అయ్యింది.

వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ, ద్రవ్యోల్బణం కారణంగా రానున్న రోజుల్లో రేట్​ హైక్​ ఉండొచ్చన్న సంకేతాలు ఫెడ్​ నుంచి అందడమే ఈ నష్టాలకు కారణం. అమెరికా ఫెడ్​ మీటింగ్​ ఔట్​పుట్​కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పందం సంతకం చేశానని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించడంతో ముడి చమురు ధర పతనమైంది. బ్రెంట్​ క్రూడ్ 1.12శాతం పడి బ్యారెల్​కి 78.66 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

వీ-మార్ట్ రీటైల్- బై రూ. 764, స్టాప్​ లాస్​ రూ. 723, టార్గెట్​ రూ. 825

విషాల్ మెగా మార్ట్- బై రూ. 119, స్టాప్​ లాస్​ రూ. 116, టార్గెట్​ రూ. 125

ఔరబిందో ఫార్మా- బై రూ. 1423, స్టాప్​ లాస్​ రూ. 1440, టార్గెట్​ రూ. 1460

ఎస్బీఐ- బై రూ. 1025, స్టాప్ లాస్​ రూ. 1888, టార్గెట్​ రూ. 2150

బ్రేకౌట్ స్టాక్స్ టు బై..

జీఎన్​ఎఫ్​సీ- బై రూ. 559, స్టాప్​ లాస్​ రూ. 535, టార్గెట్​ రూ. 600

కేఈఐ ఇండస్ట్రీస్- బై రూ. 5643, స్టాప్​ లాస్​ రూ. 5345, టార్గెట్​ రూ. 6180

కేఫిన్ టెక్నాలజీస్- బై రూ. 898, స్టాప్​ లాస్​ రూ. 860, టార్గెట్​ రూ. 985

ఎన్​బీసీసీ- బై రూ. 112.80, స్టాప్​ లాస్​ రూ. 107, టార్గెట్​ రూ. 124

కజారియా సెరమిక్స్- బై రూ. 1156, స్టాప్​ లాస్​ రూ. 1100, టార్గెట్​ రూ. 1270

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More