Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన 8 స్టాక్స్ టు బై లిస్ట్ ఇదే..

Stock market updates : ఆగస్టు 25, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 25, 2026, 08:16:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 172 పాయింట్లు పడి 77,369 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 33 పాయింట్లు కోల్పోయి 24,219 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 236 పాయింట్లు పడి 57,526 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,181.66 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,493.41 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 2 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 24,150- 24,100 కీలక సోపర్ట్​గా ఉంది. ఆ తర్వాత 24,050- 24,000 జోన్​ని చూడవచ్చు. ఇక 24,300 వద్ద రెసిస్టెన్స్​ ఉంది. అది బ్రేక్ అయితే సూచీ 24,500 వరకు వెళుతుంది,​” అని స్టాక్ మార్కెట్​ నిపుణులు చెబుతున్నారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.26 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.28శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.76 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

ఇరాన్​పై అమెరికా ఆర్థిక ఆంక్షల వేళ అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర స్వల్పంగా పెరిగింది. బ్రెంట్​ క్రూడ్ 0.66శాతం పెరిగి బ్యారెల్​కి 92.8 డాలర్ల వద్ద ట్రేడ్​ అవుతోంది.

స్టాక్స్​ టు బై..

వెల్​స్పన్ లివింగ్- బై రూ. 190.4, స్టాప్ లాస్ రూ. 184, టార్గెట్​ రూ. 204

రెడింగ్టన్- బై రూ. 365, స్టాప్​ లాస్​ రూ. 352, టార్గెట్​ రూ. 390

ఎల్​టీఎం- బై రూ. 4515, స్టాప్​ లాస్​ రూ. 4450, టార్గెట్​ రూ. 4700

కామ్స్- బై రూ. 455, స్టాప్​ లాస్​ రూ. 435, టార్గెట్​ రూ. 470

సిప్లా- బై రూ. 1435, స్టాప్ లాస్​ రూ. 1420, టార్గెట్​ రూ. 1465

హిందాల్కో ఇండస్ట్రీస్- బై రూ. 1058, స్టాప్​ లాస్​ రూ. 1035, టార్గెట్​ రూ. 1120

నాల్కో ఇండస్ట్రీస్- బై రూ. 176, స్టాప్​ లాస్​ రూ. 172, టార్గెట్​ రూ. 186

వీ-మార్ట్ రీటైల్ - బై రూ. 856, స్టాప్​ లాస్​ రూ. 836, టార్గెట్​ రూ. 905

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More