Stock market : ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్ స్టాక్​కి టైమ్ వచ్చింది! షేర్​ ప్రైజ్​ టార్గెట్ ఇదే..

Stocks to buy today : మే 29, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 29, 2026, 08:14:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gift Nifty today : బక్రీద్ కారణంగా గురువారం స్టాక్​ మార్కెట్​లకు సెలవు. ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 142 పాయింట్లు పడి 75,868 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 7 పాయింట్లు కోల్పోయి 23,907 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 239 పాయింట్లు పతనమై 54,854 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్​ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్​ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,042.70 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,821.00 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 120 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 కీలక 23,850- 24,000 లెవల్స్​ మధ్య కన్సాలిడేట్​ అవుతోంది. ఈ సపోర్ట్​ కొనసాగడం కీలకం. పైన 24,000 దాటగలిగితే సూచీ రానున్న రోజుల్లో అక్కడి నుంచి 24,2000 24,400 లెవల్స్​ వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది,” అని ప్రభుదాస్ లిల్లధేర్​కి చెందిన వైస్​ ప్రెసిడెంట్, టెక్నికలర్​ రీసెర్చ్​ ఎనలిస్ట్ వైశాలీ పరేఖ్​ తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.05 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.58శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.91 శాతం పెరిగింది.

మరోవైపు ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో చమురు ధర స్వల్పంగా తగ్గింది. బ్రెంట్ క్రూడ్ 0.5శాతం పడి బ్యారెల్​కి 92.24కి చేరింది.

స్టాక్స్​ టు బై..

జీఎంఆర్ పవర్- బై రూ. 108, స్టాప్​ లాస్​ రూ. 104, టార్గెట్​ రూ. 118

పైన్ ల్యాబ్స్- బై రూ. 145, స్టాప్​ లాస్​ రూ. 140, టార్గెట్​ రూ. 155

బీఎఫ్ యుటిలిటీస్- బై రూ. 570, స్టాప్​ లాస్​ రూ. 560, టార్గెట్​ రూ. 600

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

వెల్​స్పన్ కార్ప్- బై రూ. 1373, స్టాప్​ లాస్​ రూ. 1315, టార్గెట్​ రూ. 1485

ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ- బై రూ. 39.24, స్టాప్​ లాస్​ రూ. 37.35, టార్గెట్​ రూ. 43

గ్రాన్యూల్స్ ఇండియా- బై రూ. 783, స్టాప్​ లాస్​ రూ. 747, టార్గెట్​ రూ. 850

చెన్నై పెట్రోలియం కార్పొరేషన్- బై రూ. 1053, స్టాప్​ లాస్​ రూ. 1000, టార్గెట్​ రూ. 1135

ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్- బై రూ. 71.48, స్టాప్​ లాస్​ రూ. 77.50, టార్గెట్​ రూ .68.50

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More