...
...
Next Story

Study Abroad : విదేశాల్లో భారతీయులు.. ఎక్కువగా ఏం చదువుకుంటున్నారో తెలుసా?

Study in US : భారతీయ విద్యార్థులు విదేశీ విద్య విషయంలో ఏయే కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నారు? 2018-2022 మధ్య కాలంలో మారిన ట్రెండ్స్ ఏంటి? అన్న అంశాలపై నీతి ఆయోగ్ విడుదల చేసిన సమగ్ర నివేదిక పూర్తి వివరాలు..

Published on: Apr 28, 2026, 05:39:54 IST
Advertisement

Indian students abroad : ప్రతిభ ఉన్న భారతీయుడు ప్రపంచ వేదికపై తన సత్తా చాటాలని కోరుకోవడం సహజం. అయితే, ఒకప్పుడు కేవలం డిగ్రీ కోసమే విదేశాలకు వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది! నీతి ఆయోగ్ విడుదల చేసిన 'ఇంటర్నేషనల్ స్టూడెంట్ మొబిలిటీ: ఏ గ్లోబల్ అండ్ ఇండియన్ టెంపోరల్ ఓవర్‌వ్యూ' అనే పరిశోధనా పత్రం ప్రకారం.. భారతీయ విద్యార్థులు ఇప్పుడు కెరీర్ గ్యారెంటీ ఇచ్చే కోర్సులనే ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, డేటా సైన్స్, మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో భారీగా ఎన్‌రోల్‌మెంట్లు జరుగుతున్నాయి.

స్టెమ్ కోర్సులదే హవా..

విదేశాల్లో భారతీయులు.. ఎక్కువగా ఏం చదువుకుంటున్నారో తెలుసా?
విదేశాల్లో భారతీయులు.. ఎక్కువగా ఏం చదువుకుంటున్నారో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఉన్న డిమాండ్ దృష్ట్యా, భారతీయ విద్యార్థులు ఎక్కువగా స్టెమ్ (Science, Technology, Engineering, Mathematics) కోర్సుల వైపు పరుగెత్తుతున్నారు. 2020-21 గణాంకాల ప్రకారం, విదేశాలకు వెళ్లే విద్యార్థులలో దాదాపు 16.4 శాతం మంది ఇంజనీరింగ్ కోర్సులను ఎంచుకున్నారు. అలాగే మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో 15.7 శాతం మంది ప్రవేశాలు పొందారు.

మొత్తంగా చూస్తే, విదేశాలకు వెళుతున్న మన దేశ విద్యార్థులలో మూడింట ఒక వంతు మంది కేవలం టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసమే వెళుతున్నారు. ఇది గ్లోబల్ ఐటీ మార్కెట్‌లో ఇండియన్ ప్రొఫెషనల్స్‌కు ఉన్న క్రేజ్‌ను అద్దం పడుతోంది.

మేనేజ్‌మెంట్ వైపు మక్కువ..

సాఫ్ట్‌వేర్ రంగం తర్వాత భారతీయ విద్యార్థులను అత్యధికంగా ఆకర్షిస్తున్న విభాగం బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్. విదేశీ ప్రయాణాల్లో సుమారు 12.6 శాతం ఎన్‌రోల్‌మెంట్లు ఈ విభాగంలోనే ఉన్నాయి. ముఖ్యంగా గ్లోబల్ నెట్‌వర్కింగ్, కార్పొరేట్ సంస్థల్లో భారీ ప్యాకేజీలు లభిస్తుండటంతో ఎంబీఏ వంటి కోర్సులకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ఇది కేవలం డిగ్రీ పొందడమే కాకుండా, అంతర్జాతీయ కెరీర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే మార్గంగా విద్యార్థులు భావిస్తున్నారు.

సామాజిక శాస్త్రాలు, జర్నలిజం వెనుకబడ్డాయా?

విదేశాల్లో వైద్య విద్యకు అయ్యే భారీ ఖర్చు.

అక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఉండాల్సిన కఠినమైన లైసెన్సింగ్ నిబంధనలు.

స్వదేశంలోనే తగినన్ని వైద్య విద్యా అవకాశాలు అందుబాటులో ఉండటం.

అయితే, ఇటీవల కాలంలో ఆర్ట్స్, ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్స్‌లో కూడా క్రమంగా ఆసక్తి పెరుగుతోందని నీతి ఆయోగ్ తన అధ్యయనంలో పేర్కొంది. మన రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ, విదేశీ విద్యపై ఉన్న మక్కువ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks