Supreme Court Recruitment : సుప్రీంకోర్టులో ఉద్యోగ ఖాళీలు - దరఖాస్తు తేదీలు, నోటిఫికేషన్ వివరాలివే
సుప్రీంకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 23 నుంచి ప్రారంభమవుతుంది.
ఢిల్లీలోని సుప్రీం కోర్టు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ ఏయింది.రెగ్యూలర్ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 22 ఖాళీలున్నాయి.వీటిలోనూ అత్యధికంగా అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు 14 ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 8వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. https://www.sci.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
సుప్రీంకోర్టు ఉద్యోగ నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు
- ఉద్యోగ ప్రకటన - సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ.
- ఉద్యోగ ఖాళీలు - 22
- ఖాళీల వివరాలు - అసిస్టెంట్ ఎడిటర్ 05, అసిస్టెంట్ డైరెక్టర్ 01, సీనియర్ కోర్టు అసిస్టెంట్ 02, అసిస్టెంట్ లైబ్రేరియన్ - 14.
- అసిస్టెంట్ ఎడిటర్ పోస్టులకు లా డిగ్రీ ఉండాలి. మూడేళ్లకుపైగా న్యాయవాదిగా పని చేసిన అనుభవం ఉండాలి. లేక న్యాయ విభాగంలో పని చేసిన అనుభవమైన ఉండాలి. ఇక లైబ్రేరియన్ పోస్టుకు తప్పకుండా లైబ్రరీ సైన్స్ లో ఉత్తీర్ణత ఉండటంతో పాటు పని చేసిన అనుభవం ఉండాలి. నోటిఫికేషన్ లో పూర్తి వివరాలను చూడొచ్చు.
- దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 30 ఏళ్ల నుంచి 40 ఏళ్లుగా నిర్ణయించారు
- అసిస్టెంట్ ఎడిటర్‌కు నెలకు రూ.78,800. అసిస్టెంట్ డైరెక్టర్ కు రూ.67,700. సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ అసిస్టెంట్ లైబ్రేరియన్ కు రూ.47,600 జీతం చెల్లిస్తారు.
- దరఖాస్తు విధానం - ఆన్లైన్
- దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం - 23 ఫిబ్రవరి 2026.
- దరఖాస్తు చివరి తేదీ - 8 మార్చి 2026.
- ఎంపిక విధానం - రాత పరీక్ష, ఇంటర్వ్యూ
- పరీక్షా కేంద్రాలు - ఢిల్లీ, ముంబై, కోల్ కత్తా, చెన్నై
- ఇంటర్వ్యూ మాత్రం కేవలం ఢిల్లీలోనే ఉంటుంది. 1.3 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. కొన్ని పోస్టులకు 1.10 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://www.sci.gov.in/
ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను తెలుసుకోవచ్చు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

