AIBE 20 Exam Key : 'లా' అభ్యర్థులకు అలర్ట్ - ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ 'కీ' విడుదల, డౌన్లోడ్ ప్రాసెస్ ఇలా
ఏఐబీఈ - 20 ప్రాథమిక కీ విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థులు https://www.allindiabarexamination.com/ వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా అభ్యంతరాలుంటే డిసెంబర్ 10లోపు పంపవచ్చు.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఏఐబీఈ - 20 ప్రాథమిక కీ వచ్చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు allindiabarexamination.com వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాథమిక కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 4 సెట్ల జవాబులు ఇందులో ఉంటాయి.

ప్రాథమిక కీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే పంపొచ్చు. ఇందుకు డిసెంబర్ 10వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. సరైనా ఆధారాలతో అభ్యంతరాలను పంపాలని అధికారులు సూచించారు.
AIBE - 20 ఎగ్జామ్ - కీ ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- అభ్యర్థులు https://www.allindiabarexamination.com/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని ‘AIBE XX Provisional Answer Key’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీకు పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. ఇందులో 4 సెట్ల కీ ఉంటుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు
ఈ ఏడాది నవంబర్ 30వ తేదీన దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో AIBE - 20 బార్ పరీక్ష జరిగింది. మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు సింగిల్ షిఫ్టులో పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు విశాఖ, తిరుపతి, విజయవాడలోనూ ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి.
ఆలిండియా బార్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కులు 40 శాతంగా ఉంది. సిలబస్ ప్రకారం AIBE 20లో 19 అంశాలు నుంచి ప్రశ్నలు ఇచ్చారు. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత వాటిని పరిశీలిస్తారు. ఆ తర్వాత తుది ఫలితాలను ప్రకటిస్తారు. అడ్వొకేట్ గా ఎన్ రోల్ చేసుకున్న వారితో పాటు ఎల్ఎల్ బీ ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులు కూడా ఏఐబీఈ పరీక్ష రాయవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

