మేమైతే కొలంబో వెళ్తున్నాం.. ఇక వాళ్లిష్టం: ఇండియాతో మ్యాచ్ పాకిస్థాన్ బాయ్‌కాట్ చేయడంపై సూర్యకుమార్ కామెంట్స్
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న జరగాల్సిన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ తారస్థాయికి చేరింది. పాకిస్థాన్ ఆడబోమని అక్కడి ప్రధాని చెబుతుంటే, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. "మేము కొలంబో వెళ్తున్నాం.. ఆడటానికి సిద్ధం" అని తేల్చి చెప్పాడు.
టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. దాయాది దేశం పాకిస్థాన్ ఈ మ్యాచ్ ఆడేందుకు నిరాకరిస్తుండగా, టీమిండియా మాత్రం తన వైఖరిని స్పష్టం చేసింది. గురువారం (ఫిబ్రవరి 5) ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ నిర్ణయంతో సంబంధం లేకుండా తాము శ్రీలంక వెళ్తున్నామని తేల్చిచెప్పాడు.

"మేము వద్దనలేదు.. వాళ్ళే వద్దంటున్నారు"
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌పై నెలకొన్న సందిగ్ధత గురించి సూర్యకుమార్ మాట్లాడుతూ.. "మా మైండ్‌సెట్ చాలా క్లియర్‌గా ఉంది. మేము ఆడమని చెప్పలేదు. ఆడబోమని చెప్పింది వాళ్ళు (పాకిస్థాన్). ఐసీసీ షెడ్యూల్ ఇచ్చింది, ప్రభుత్వం న్యూట్రల్ వెన్యూ (కొలంబో) నిర్ణయించింది. మా వరకు అయితే కొలంబోకి ఫ్లైట్ టికెట్లు బుక్ అయ్యాయి.. మేము వెళ్తున్నాం. మిగతా విషయాలు అక్కడ చూసుకుందాం" అని ఘాటుగా స్పందించాడు. బీసీసీఐ నుంచి తమకు ఆడొద్దని ఎలాంటి ఆదేశాలు రాలేదని అతడు స్పష్టం చేశాడు.
పాక్ ప్రధాని మొండి వైఖరి
బుధవారం (ఫిబ్రవరి 4) రాత్రి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని పాక్ జట్టు వచ్చే వారం భారత్‌తో మ్యాచ్ ఆడే ప్రసక్తే లేదని మరోసారి తేల్చి చెప్పారు. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ విషయాన్ని ఐసీసీకి ఇంకా అధికారికంగా తెలియజేయలేదు.
వాకోవర్ ఎలా ఇస్తారు? రూల్స్ ఏంటి?
ఒకవేళ పాకిస్థాన్ ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తే.. ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్‌కు 'వాకోవర్' లభిస్తుంది. అంటే మ్యాచ్ ఆడకుండానే భారత్‌ను విజేతగా ప్రకటిస్తారు. దీనికి రెండు పాయింట్లు లభిస్తాయి. అయితే ఇది జరగాలంటే ఒక ప్రాపెస్ ఉంటుంది.
ఫిబ్రవరి 15న షెడ్యూల్ ప్రకారం భారత జట్టు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియానికి చేరుకోవాలి. టాస్ వేసే సమయానికి టీమిండియా గ్రౌండ్‌లో ఉండాలి.
ఆ సమయానికి పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా టాస్ కోసం రాకపోతే.. మ్యాచ్ రిఫరీ పాకిస్థాన్ గైర్హాజరైనట్లు నిర్ధారించి, భారత్‌ను విజేతగా ప్రకటిస్తారు.
మొత్తానికి సూర్యకుమార్ వ్యాఖ్యలతో బంతి ఇప్పుడు పాకిస్థాన్ కోర్టులో ఉన్నట్లయింది. వాళ్ళు వస్తారా లేక పాయింట్లు వదులుకుంటారా అనేది వేచి చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


