Suzuki Jimny Electric : ఎలక్ట్రిక్​ అవతారంలో సుజుకీ జిమ్నీ- ఈవీ రేంజ్​ ఎంతంటే..

Suzuki Jimny EV : సుజుకీ జిమ్నీ ఇప్పుడు ఎలక్ట్రిక్​ అవతారంలో రానుంది! ఈ మోడల్​కి సంబంధించి ప్రస్తుతం టెస్ట్​ డ్రైవ్​ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఆఫ్​-రోడ్​ సుజుకీ జిమ్నీ ఈవీ గురించి అనేక ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 5, 2026, 09:08:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Maruti Suzuki Jimny EV : సుజుకీ జిమ్నీ అంటే ఆఫ్-రోడ్ ప్రియులకు ఒక క్రేజ్ ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ ఐకానిక్ వాహనం ఎలక్ట్రిక్ రూపంలో రాబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. మే 2026 నాటి తాజా సమాచారం ప్రకారం.. జిమ్నీ ఈవీ ప్రోటోటైప్ మంచు కురుస్తున్న ప్రాంతాల్లో ‘కోల్డ్-వెదర్ టెస్టింగ్’ చేస్తూ కనిపించింది. రెండు భారీగా కవర్ చేసిన టెస్ట్ వాహనాలు కలిపి కనిపించడంతో, సుజుకీ ఈ ప్రాజెక్ట్‌పై వేగంగా పనిచేస్తోందని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సుజుకీ జిమ్నీ ఈవీ ఇదిగో..
సుజుకీ జిమ్నీ ఈవీ ఇదిగో..

సుజుకీ జిమ్నీ ఈవీ- డిజైన్ ఎలా ఉండబోతోంది?

స్పై షాట్స్ ప్రకారం.. జిమ్నీ ఈవీ తన క్లాసిక్ 'బాక్సీ' డిజైన్‌ను అలాగే కొనసాగించనుంది. అయితే కొన్ని కీలక మార్పులు కనిపిస్తున్నాయి:

క్లోజ్డ్ గ్రిల్: ఇంజిన్ కూలింగ్ అవసరం లేని కారణంగా ముందు భాగంలో గ్రిల్ మూసివేసి ఉంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలకు సాధారణంగా ఉండే ఫీచర్.

కొత్త లైటింగ్: ఫ్రంట్ ఫాసియాలో సన్నని హారిజాంటల్ ఎల్ఈడీ లైట్లు కనిపిస్తున్నాయి.

బంపర్ మార్పులు: బ్యాటరీ, ఇతర ఎలక్ట్రిక్ భాగాల కూలింగ్ కోసం బంపర్ కింది భాగంలో ఎయిర్ ఇన్‌టేక్స్ ఇచ్చారు.

సుజుకీ జిమ్నీ ఈవీ- ప్రధాన ఆకర్షణ: సాలిడ్ ఫ్రంట్ యాక్సిల్..

జిమ్నీ ఈవీలో అత్యంత ఆసక్తికరమైన అంశం దాని సస్పెన్షన్. సాధారణంగా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు సౌకర్యం కోసం ఇండిపెండెంట్ సస్పెన్షన్‌ను వాడుతుంటాయి. కానీ, ఈ టెస్ట్ వాహనంలో సాలిడ్ ఫ్రంట్ యాక్సిల్ కనిపించింది.

ఎందుకంత ప్రత్యేకం? సాలిడ్ యాక్సిల్ ఉంటే కఠినమైన ఆఫ్-రోడ్ దారుల్లో వాహనం తిరుగులేని పట్టును సాధిస్తుంది. అంటే, ఎలక్ట్రిక్ రూపంలోకి మారినా జిమ్నీ తన ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని వదులుకోదని అర్థమవుతోంది.

సుజుకీ జిమ్నీ ఈవీ- ఇంజిన్, పవర్..

ప్రస్తుత పెట్రోల్ జిమ్నీ 1.5-లీటర్ ఇంజిన్‌తో 104.8 హెచ్​పీ పవర్‌ను ఇస్తుంది. ఎలక్ట్రిక్ వెర్షన్‌లో దీనికి బదులుగా డ్యూయల్ మోటార్ సెటప్ (ముందు ఒక మోటార్, వెనుక ఒక మోటార్) వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల 4డబ్ల్యూడీ (ఫోర్ వీల్ డ్రైవ్) సిస్టమ్ మరింత పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. సుజుకీ తన ఈ-విటారా లో వాడిన ‘ఎలక్ట్రిక్ ఆల్-గ్రిప్’ టెక్నాలజీని దీనికి కూడా అడాప్ట్ చేసే అవకాశం ఉంది.

సుజుకీ జిమ్నీ ఈవీ- లాంచ్ ఎప్పుడు?

సుజుకీ సంస్థ ఇప్పటివరకు జిమ్నీ ఈవీ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, మంచు ప్రాంతాల్లో జరుగుతున్న ఈ తీవ్రమైన పరీక్షలను బట్టి చూస్తే, అభివృద్ధి పనులు ముగింపు దశకు చేరుకున్నాయని తెలుస్తోంది. 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్​లో దీని గురించి అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. జిమ్నీ ఈవీ రేంజ్ ఎంత ఉండవచ్చు?

అఫీషియల్ వివరాలు లేకపోయినా, ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం 350-400 కి.మీ రేంజ్ ఉండేలా సుజుకీ ప్లాన్ చేసే అవకాశం ఉంది.

2. ఇది పెట్రోల్ జిమ్నీ కంటే బరువుగా ఉంటుందా?

అవును. ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్యాక్ కారణంగా దీని బరువు పెట్రోల్ వెర్షన్ కంటే కచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. ఇది ఆఫ్-రోడింగ్ చేసేటప్పుడు గ్రిప్ కోసం ఉపయోగపడవచ్చు.

3. ఇండియాలో ఇది ఎప్పుడు వస్తుంది?

సుజుకీ గ్లోబల్ లాంచ్ తర్వాతే మారుతీ సుజుకీ దీనిని భారత మార్కెట్​లోకి తీసుకువచ్చే ఆలోచన చేస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More