...
...
Next Story

Tata Aeris : టాటా ‘ఏరిస్’​గా టిగోర్ ఫేస్​లిఫ్ట్- లాంచ్​ రేపే! ఇవీ హైలైట్స్​..

టాటా టిగోర్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​గా వస్తున్న టాటా ఏరిస్​ కాంపాక్ట్ సెడాన్.. శుక్రవారం లాంచ్​కానుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​కి చెందిన ఎక్స్​టీరియర్​, ఇంటీరియర్, ఇంజిన్, వేరియంట్లపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Sep 24, 2026, 10:45:35 IST
Advertisement

భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న స్వదేశీ దిగ్గజం టాటా మోటార్స్, సబ్‌కాంప్యాక్ట్ సెడాన్ మార్కెట్లో సరికొత్త విప్లవానికి తెరలేపింది. పండుగ సీజన్ ముంగిట తమ సరికొత్త కాంపాక్ట్ సెడాన్ ‘టాటా ఏరిస్’ను రేపు, సెప్టెంబర్ 25న అధికారికంగా ఆవిష్కరించేందుకు కంపెనీ సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన డీలర్‌షిప్‌లకు ఈ కార్లు చేరుకుంటున్నాయి. వాహన ప్రేమికుల్లో ఆసక్తిని పెంచుతూ, లాంచ్‌కు కొద్ది గంటల ముందు ఈ కారు ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ వివరాలను వెల్లడిస్తూ కంపెనీ కొత్త టీజర్‌ను విడుదల చేసింది.

టాటా ఏరిస్ ఇంటీరియర్..
టాటా ఏరిస్ ఇంటీరియర్..

కాంపాక్ట్ సెడాన్ టాటా టిగోర్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెనే ఈ టాటా ఏరిస్. దేశీయ మార్కెట్‌లో సుదీర్ఘకాలంగా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న మారుతీ సుజుకీ డిజైర్, హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరాలకు నేరుగా పోటీ ఇచ్చే లక్ష్యంతో టాటా మోటార్స్ ఈ కారును తీర్చిదిద్దింది.

టాటా ఏరిస్ ప్రీమియం కేబిన్.. అధునాతన ఫీచర్లు!

టాటా ఏరిస్ ఇంటీరియర్ లేఔఓట్ టియాగో, టిగోర్ మోడళ్లను పోలి ఉన్నప్పటికీ, ఇందులో విలాసవంతమైన మార్పులు చేశారు. క్యాబిన్ లోపల డిజిటల్ అనుభూతికి పెద్దపీట వేశారు. డ్యాష్‌బోర్డ్ మధ్యలో అమర్చిన 10.24-ఇంచుల ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ డ్రైవర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.

డ్యూయల్-స్పోక్ స్టీరింగ్ వీల్, ఫ్యాబ్రిక్ స్టైల్ డ్యాష్‌బోర్డ్ కాంబినేషన్‌తో పాటు, సీట్ల కోసం లైట్ బీజ్, గ్రే కలర్ థీమ్‌ను ఎంచుకున్నారు. రెండు స్మార్ట్‌ఫోన్‌లను పక్కపక్కనే పెట్టి ఛార్జ్ చేసుకునేలా విశాలమైన డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జింగ్ డాక్‌ను ఇందులో ప్రవేశపెట్టడం మరో ప్రత్యేకత. దీనికి తోడు 360-డిగ్రీల కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సెంటర్ కన్సోల్‌లో కప్‌హోల్డర్లు, స్టోరేజ్‌తో కూడిన ఆర్మ్‌రెస్ట్ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. పుష్-బటన్ స్టార్ట్-స్టాప్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఓఆర్‌వీఎంలు, వెనుక సీట్లకు ఏసీ వెంట్లు, టైప్-సీ యూఎస్‌బీ పోర్టులు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని అందిస్తాయి. ఆటోమేటిక్ (ఏఎంటీ) వేరియంట్లలో సాంప్రదాయ గేర్ లివర్ స్థానంలో ఆకర్షణీయమైన 'రోటరీ డ్రైవ్ సెలెక్టర్'ను పొందుపరిచారు.

టాటా ఏరిస్ స్పోర్టీ ఎక్స్‌టీరియర్.. కనెక్టెడ్ ఎల్‌ఈడీ లైటింగ్!

కారు సైడ్ ప్రొఫైల్ పరిశీలిస్తే డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్, సీ-పిల్లర్ వరకు సాగే ఫాస్ట్‌బ్యాక్ రూఫ్‌లైన్ కారుకి ప్రత్యేకమైన రూపాన్ని తెచ్చిపెట్టాయి. వెనుక భాగంలో టెయిల్ లాంప్స్‌ను కలుపుతూ ట్రంక్ వ్యాప్తంగా ఉండే 'ఫుల్-విడ్త్ ఎల్‌ఈడీ లైట్ బార్' ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. లైట్ బార్ కింద విశాలమైన అక్షరాలతో 'AERIS' అని ముద్రించారు. బంపర్ కింది భాగంలో నంబర్ ప్లేట్ అమరిక, నిలువుగా ఉండే రిఫ్లెక్టర్లను ఏర్పాటు చేశారు.

టాటా ఏరిస్ శక్తివంతమైన ఇంజిన్.. సీఎన్జీ-ఆటోమేటిక్ వేరియంట్!

సాంకేతిక సామర్థ్యం పరంగా టాటా ఏరిస్ విశ్వసనీయమైన 1.2-లీటర్, 3-సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఇది 86 పీఎస్ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయి.

ఇంధన వ్యయాన్ని తగ్గించుకోవాలనుకునే వారి కోసం టాటా ఐసీఎన్జీ వేరియాన్ని కూడా అందుబాటులోకి తెస్తోంది. సీఎన్జీ మోడ్‌లో ఈ ఇంజిన్ 72 బీహెచ్‌పీ పవర్, 96.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది. ముఖ్యంగా సీఎన్జీ విభాగంలోనూ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను అందించడం ద్వారా టాటా మోటార్స్ కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.

రేపటి లాంచ్​ ఈవెంట్​లో ఈ టాటా ఏరిస్​ ధర, ఇతర ఫీచర్లు తదితర వివరాలు తెలుస్తాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks