కళ్లు చెదిరే క్యాచ్ పడుతుండగా బౌండరీ లైన్‌ని తాకిన ఫీల్డర్ ‘టవల్’! అది 6 ఆ? ఔట్ ఆ?
బంగ్లాదేశ్- ఐర్లాండ్ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన జరిగింది. ఐర్లాండ్ ఫీల్డర్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు. బంతిని గాల్లోకి విసిరి బౌండరీ లైన్ మీద పడ్డాడు. వెంటనే తేరుకుని కాస్త పక్కకు జరిగి తిరిగి క్యాచ్ అందుకున్నాడు. కానీ అతని టవల్.. బౌండరీ లైన్‌ని తాగిలింది!
శనివారం ఛటోగ్రామ్‌లోని బిర్ శ్రేష్ఠో ఫ్లైట్ లెఫ్టినెంట్ మతియుర్ రెహమాన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై బంగ్లాదేశ్ ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసి, సిరీస్‌ను సమం చేసింది. బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ మెరుపు అర్ధ సెంచరీతో విజృంభించి, ఆతిథ్య జట్టు 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు.

దాస్ 37 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సులతో సహా 57 పరుగులు సాధించాడు. ఈ విజయంతో బంగ్లాదేశ్ కేవలం రెండు బంతులు మిగిలి ఉండగా, నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.
నిజానికి, లిటన్ దాస్ ఆడిన ఈ కీలక ఇన్నింగ్స్‌లో అధిక భాగం “లక్”పై ఆధారపడి ఉంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే దాస్‌ను అదృష్టం వరించింది!
బంగ్లాదేశ్ ఛేజింగ్‌లో 11వ ఓవర్ నాలుగో బంతికి, కేవలం ఐదు బంతుల వ్యవధిలో రెండో వికెట్‌ను తీశామని ఐర్లాండ్ భావించింది. గారెత్ డెలనీ డీప్ మిడ్-వికెట్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అప్పటికి దాస్ 24 బంతుల్లో 34 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ స్కోరు 94 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. అయితే, ఆ ఒక టవల్ గనుక అడ్డుపడకపోయి ఉంటే, ఈ ఇన్నింగ్స్ అసలు వీరోచితంగా మారేదే కాదు!
జాషువా లిటిల్ వేసిన షార్ట్ డెలివరీని దాస్ ఫ్రంట్ ఫుట్ మీద నుంచి లాగాడు. డీప్ ఫీల్డ్‌లో ఉన్న డెలనీ వెనుకకు పరిగెడుతూ తన కుడి చేతిని చాచి క్యాచ్ అందుకున్నాడు. బౌండరీ లైన్‌కు దగ్గరగా ఉండటం, తన వేగాన్ని కోల్పోవడం గమనించిన డెలనీ, తెలివిగా బంతిని తిరిగి గాల్లోకి విసిరాడు.
డెలనీ నేలపై పడిపోయి, వెంటనే లేచి, ముందుకు వచ్చి క్యాచ్‌ను పూర్తి చేయడానికి ప్రయత్నించాడు. అది సీజన్‌లోనే అత్యుత్తమ క్యాచ్‌లలో ఒకటిగా నిలవాలి. కానీ అలా జరగలేదు! ఇందుకు కారణం టవల్!
టీవీ అంపైర్ ఆ ప్రయత్నాన్ని సమీక్షించిన తర్వాత, దానిని సిక్స్‌గా ప్రకటించాడు. ఎందుకంటే, డెలనీ వెనుక నడుముకు టక్ చేసుకున్న టవల్, క్యాచ్ అందుకునే సమయంలో బౌండరీ కుషన్‌ను తాకినట్లు గమనించారు. టవల్ అనేది ఆటగాడి పరికరంలో భాగంగా పరిగణించిస్తారు కాబట్టి, ఈ నిర్ణయం బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా మారింది—ఆ విధంగా దాస్ ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
మ్యాచ్‌లో అంతకుముందు, ఐర్లాండ్ వికెట్ కీపర్-బ్యాటర్ లోర్కాన్ టక్కర్ 32 బంతుల్లో 42 పరుగులు చేయడంతో, ఐర్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ అద్భుతంగా రాణించాడు. కేవలం 18 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి ఐర్లాండ్ మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు.
జవాబుగా, కెప్టెన్ దాస్‌కు పర్వేజ్ హుస్సేన్ ఎమాన్ రెండవ వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యంలో చక్కటి సహకారం అందించాడు. ఆ తర్వాత దాస్ ఒంటరి పోరాటం చేసి సిరీస్‌ను సమం చేశాడు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


