స్టైలిష్ బైక్‌తో అడ్వెంచర్ టూరర్ సెగ్మెంట్‌లోకి టీవీఎస్- Apache RTX 300 ధర ఎంతంటే..
టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300 విడుదలైంది. ఈ బైక్‌తో అడ్వెంచర్ టూరర్ సెగ్మెంట్‌లోకి టీవీఎస్ ఎంట్రీ ఇచ్చింది. కేటీఎం, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనున్న సరికొత్త టీవీఎస్ బైక్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..
మచ్ అవైటెడ్ అపాచీ ఆర్టీఎక్స్ 300 అడ్వెంచర్ టూరర్ని భారత మార్కెట్లో తాజాగా విడుదల చేసింది టీవీఎస్ మోటార్ కంపెనీ. దీని ప్రారంభ ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ లాంచ్‌తో టీవీఎస్ అధికారికంగా అడ్వెంచర్ టూరర్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది!

టీవీఎస్ కొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన ఈ అపాచీ ఆర్టీఎక్స్ 300.. మార్కెట్లో ఉన్న కేటీఎం 250 అడ్వెంచర్, యెజ్డీ అడ్వెంచర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 వంటి ప్రముఖ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300: ఇంజిన్ వివరాలు..
టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300 అడ్వెంచర్ టూరర్ బైక్‌లో కొత్తగా డెవలప్ చేసిన 299సీసీ, లిక్విడ్-ఆయిల్ కూల్డ్, సింగిల్-సిలిండర్ ఆర్టీ-ఎక్స్‌డీ4 ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 9,000 ఆర్‌పీఎం వద్ద 35.5 హెచ్‌పీ గరిష్ట పవర్‌ని, 7,000 ఆర్‌పీఎం వద్ద 28.5 ఎన్ఎమ్ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ పవర్ మిల్లుకు బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో కూడిన ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఇందులో స్మూత్ ట్రాన్స్‌మిషన్ కోసం అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ ఫీచర్ కూడా ఉంది.
టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300: డిజైన్ అండ్ లుక్..
డిజైన్ విషయానికి వస్తే ఈ టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300 స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, అల్యూమినియం డైకాస్ట్ స్వింగ్‌ఆర్మ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్ (బలమైన ఇంధన ట్యాంక్), మస్కులర్ సైడ్ ఫెండర్‌లు, పారదర్శకమైన విండ్‌స్క్రీన్‌తో చాలా భారీగా కనిపిస్తుంది.
ముందు భాగంలో ‘కన్ను ఆకారం’ గల ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్‌లు, కొమ్ములాంటి ప్రొజెక్షన్‌తో అపాచీ ఆర్టీఎక్స్ 300 కాస్త అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. టీవీఎస్ తొలి అడ్వెంచర్ టూరర్‌లో స్ప్లిట్ రియర్ సీట్లు, అదనపు లగేజీ కోసం ప్రత్యేక లగేజీ ర్యాక్ ఉండడం వల్ల.. ఇది వెనుక కూర్చునే వారికి (పిలియన్-ఫ్రెండ్లీ) కూడా అనుకూలంగా కనిపిస్తుంది.
ఈ బైక్ వైపర్ గ్రీన్, టార్న్ బ్రాంజ్, మెటాలిక్ బ్లూ, లైటనింగ్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది.
టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300: కీలక ఫీచర్లు..
టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300లో ఫుల్-కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉంది. ఇది వేగం, కాల్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్‌లు, సెగ్మెంట్‌లోనే మొట్టమొదటి మ్యాప్ మిర్రరింగ్, గోప్రో కంట్రోల్ వంటి వివరాలను అందిస్తుంది. ఇందులో నాలుగు వేర్వేరు రైడ్ మోడ్‌లు ఉన్నాయి- అవి టూర్, ర్యాలీ, అర్బన్, రెయిన్ (వర్షం) మోడ్‌లు.
భద్రత పరంగా చూస్తే, ఇందులో ఏబీఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) మోడ్‌లు (ర్యాలీ, అర్బన్, రెయిన్), ట్రాక్షన్ కంట్రోల్ (రెండు మోడ్‌లు), క్రూయిజ్ కంట్రోల్, టీపీఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇంకా, టూ-వే థర్మోస్టాట్, ఇంటెలిజెంట్ ఎయిర్-ఫ్లో టెక్నాలజీ, పేటెంట్ పొందిన డక్ట్, డిఫ్లెక్టర్ సిస్టమ్‌ల ద్వారా టీవీఎస్ అపాచీ ఇంజిన్ ఉష్ణోగ్రతను నియంత్రించి, అవాంతరాలు లేని కంబషన్ని నిర్ధారిస్తుంది. ఇది రైడ్‌ను మరింత సులభతరం చేస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












