స్టాక్ మార్కెట్‌లో సాధారణ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌కు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్‌కు చాలా వ్యత్యాసం ఉంది. F&O అనేది డెరివేటివ్స్ (Derivatives) విభాగానికి చెందింది. అంటే, ఈ కాంట్రాక్ట్‌లకు సొంతంగా విలువ ఉండదు; ఇవి ఒక మూల ఆస్తి (Underlying Asset - స్టాక్ లేదా ఇండెక్స్) విలువపై ఆధారపడి పనిచేస్తాయి.
F&O అంటే ఏమిటి?

ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ (Futures Contract): ముందుగా నిర్ణయించిన ధర, తేదీ నాటికి ఒక ఆస్తిని కొనడానికి (కొనుగోలుదారు) లేదా అమ్మడానికి (అమ్మకందారు) ఇరుపక్షాలను బాధ్యులను (Obligation) చేస్తుంది.
ఆప్షన్స్ కాంట్రాక్ట్ (Options Contract): నిర్దిష్ట ఎక్స్‌పైరీ తేదీకి ముందే, నిర్ణీత ధర వద్ద ఆస్తిని కొనడానికి లేదా అమ్మడానికి కొనుగోలుదారుకు 'హక్కు' (Right) ఇస్తుంది, కానీ 'బాధ్యత' (Obligation) ఉండదు.
సాధారణంగా మార్కెట్ పాల్గొనేవారు రిస్క్ మేనేజ్‌మెంట్ (Hedding), స్పెక్యులేషన్ లేదా ఆర్బిట్రేజ్ కోసం ఈ కాంట్రాక్ట్‌లను ఉపయోగిస్తారు.
ఈక్విటీ ట్రేడింగ్‌కు, F&O కి ఉన్న తేడాలు
యాజమాన్యం (Ownership): ఈక్విటీ ట్రేడింగ్‌లో మీరు ఒక కంపెనీ షేర్లను కొనుగోలు చేసి, వాటికి యజమానిగా దీర్ఘకాలం ఉంచుకోవచ్చు. కానీ F&O లో మీరు షేర్లను సొంతం చేసుకోరు, కేవలం వాటి విలువ ఆధారిత కాంట్రాక్ట్‌లను మాత్రమే ట్రేడ్ చేస్తారు.
పెట్టుబడి, మార్జిన్ (Capital & Margin): ఈక్విటీలో షేర్లు కొనడానికి పూర్తి సొమ్ము చెల్లించాలి. F&O లో 'మార్జిన్' ద్వారా తక్కువ మొత్తంతో పెద్ద పొజిషన్లను (Leverage) తీసుకోవచ్చు.
కాలపరిమితి (Expiry): ఈక్విటీ షేర్లకు ఎలాంటి కాలపరిమితి ఉండదు. కానీ F&O కాంట్రాక్ట్‌లకు నిర్దిష్ట ఎక్స్‌పైరీ (వారపు లేదా నెలావారీ) తేదీలు ఉంటాయి.
రిటైల్ ఇన్వెస్టర్లు F&O లో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
ప్రొఫెషనల్ ట్రేడర్లు రిస్క్ తగ్గించుకోవడానికి F&O వాడితే, రిటైల్ ఇన్వెస్టర్లు వేగంగా లాభాలు ఆర్జించే క్రమంలో నష్టాల ముప్పును అంచనా వేయలేకపోతున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు హెచ్చరికతో ఉండటానికి ప్రధాన కారణాలు:
{{/usCountry}}ప్రొఫెషనల్ ట్రేడర్లు రిస్క్ తగ్గించుకోవడానికి F&O వాడితే, రిటైల్ ఇన్వెస్టర్లు వేగంగా లాభాలు ఆర్జించే క్రమంలో నష్టాల ముప్పును అంచనా వేయలేకపోతున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు హెచ్చరికతో ఉండటానికి ప్రధాన కారణాలు:
{{/usCountry}}1. హై లివరేజ్ - పెరిగే నష్టాలు: తక్కువ మార్జిన్ చెల్లించి పెద్ద పొజిషన్లు తీసుకోవడం వల్ల మార్కెట్ అనుకూలిస్తే ఎంత ఎక్కువ లాభం వస్తుందో, వ్యతిరేకిస్తే మీ అసలు పెట్టుబడి కంటే ఎక్కువ నష్టం వచ్చే ప్రమాదం ఉంది.
2. పరిమిత కాలపరిమితి (Time Decay): కాంట్రాక్ట్‌లకు ఎక్స్‌పైరీ తేదీలు ఉంటాయి. మీ అంచనా సరైనదే అయినా, నిర్ణీత సమయంలోగా మార్కెట్ ఆ దిశగా కదలకపోతే మీ పొజిషన్ విలువ సున్నా కావచ్చు.
3. మార్కెట్ టైమింగ్ కీలకం: ఈక్విటీల్లో దీర్ఘకాలం నిరీక్షించే వెసులుబాటు ఉంటుంది. కానీ F&O లో ఎంట్రీ, ఎగ్జిట్ సమయం సరిగ్గా లేకపోతే స్వల్ప వ్యవధిలోనే భారీ నష్టం వస్తుంది.
4. విజయం సాధించే సంభావ్యత తక్కువ: సెబీ (SEBI) 2023 నివేదిక ప్రకారం, F&O విభాగంలో ట్రేడింగ్ చేసే ప్రతి 10 మంది రిటైల్ ట్రేడర్లలో 9 మంది (90%) నష్టాలనే చవిచూస్తున్నారు.
5. మానసిక ఒత్తిడి: F&O లో వేగంగా మారే ధరల వల్ల ట్రేడర్లు తీవ్ర ఒత్తిడికి గురై కంగారులో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువ.
బాధ్యతాయుతమైన F&O ట్రేడింగ్ కోసం పాటించాల్సిన సూత్రాలు
F&O ట్రేడింగ్‌లో అత్యంత కీలకమైన గోల్డెన్ రూల్ ఏమిటంటే.. ఆ ప్రొడక్ట్ గురించి పూర్తి అవగాహన లేకుండా, అలాగే మీరు కోల్పోయినా భరించగలిగే సొమ్ముతో తప్ప, F&O ట్రేడింగ్‌లోకి ఎప్పుడూ దిగకూడదు.
సమగ్ర అవగాహన పెంచుకోండి: F&O ట్రేడింగ్ సూత్రాలు, గ్రీక్స్ (Greeks), మార్జిన్ సిస్టమ్‌పై పూర్తి స్థాయి అధ్యయనం చేయండి.
రిస్క్ పరిమితులు (Risk Limits): ప్రతి ట్రేడ్‌కు ఎంత నష్టం భరించగలరో ముందే సరిహద్దులు గీసుకోండి.
స్టాప్-లాస్ (Stop-Loss) తప్పనిసరి: ప్రతి F&O పొజిషన్‌కు క్రమం తప్పకుండా స్టాప్-లాస్ ఆర్డర్‌లను ఉపయోగించండి.
తక్కువ పోర్ట్‌ఫోలియో కేటాయింపు: మీ మొత్తం పెట్టుబడిలో చాలా స్వల్ప భాగాన్ని మాత్రమే F&O కి కేటాయించండి.
ప్రారంభకులకు సూచన: కొత్తగా మార్కెట్లోకి వచ్చేవారు ముందుగా వర్చువల్/డెమో ట్రేడింగ్ చేయడం లేదా ఈక్విటీ మార్కెట్లలో అనుభవం గడించడం శ్రేయస్కరం.
వ్యాసకర్త:
శ్రీకాంత్ చౌహాన్,
హెడ్ - ఈక్విటీ రీసెర్చ్,
కోటక్ సెక్యూరిటీస్