యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు అలర్ట్: నోటిఫికేషన్ వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడు?

UPSC Civil Services 2026 notification : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2026 నోటిఫికేషన్ విడుదల వాయిదా పడింది. ఈ తరుణంలో పరీక్ష తేదీల్లో మార్పులపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 14, 2026 1:44 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్ వంటి పోస్టుల నోటిఫికేషన్​ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేయాల్సిన 'సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ (సీఎస్​ఈ) 2026' నోటిఫికేషన్ వాయిదా పడింది. దీనితో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్​ఎస్​) నోటిఫికేషన్‌ను కూడా కమిషన్ నిలిపివేసింది. అభ్యర్థులు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను upsc.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

యూపీఎస్సీ సివిల్​ సర్వీసెస్​ 2026 నోటిఫికేషన్​ వాయిదా..
యూపీఎస్సీ సివిల్​ సర్వీసెస్​ 2026 నోటిఫికేషన్​ వాయిదా..

యూపీఎస్సీ సివిల్​ సర్వీసెస్​ 2026 నోటిఫికేషన్​ వాయిదా..

నిజానికి, యూపీఎస్సీ వార్షిక క్యాలెండర్ ప్రకారం ఈ నోటిఫికేషన్ నేడు, అంటే జనవరి 14న విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల దీనిని వాయిదా వేస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది.

"పరిపాలనా పరమైన కారణాల దృష్ట్యా జనవరి 14న విడుదల కావాల్సిన సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2026 నోటిఫికేషన్లను వాయిదా వేస్తున్నాము. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తాము," అని యూపీఎస్సీ తన అధికారిక నోటీసులో పేర్కొంది.

పరీక్షల షెడ్యూల్‌పై సందిగ్ధతయయ

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తు ప్రక్రియ జరగాల్సి ఉంది. అలాగే మే 24, 2026న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని కమిషన్ భావించింది. అయితే ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల ఆలస్యం కావడంతో, పరీక్షా తేదీల్లో కూడా ఏమైనా మార్పులు ఉంటాయా అన్న ఆందోళన అభ్యర్థుల్లో మొదలైంది.

ఈ వ్యవహారంపై స్పష్టత రావాలంటే కమిషన్ ఇచ్చే తదుపరి ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.

దరఖాస్తు చేసుకునే విధానం (నోటిఫికేషన్ విడుదలయ్యాక):

యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అభ్యర్థులు కింద తెలిపిన పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు:

స్టెప్​ 1- ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో కనిపించే 'UPSC Civil Services Exam 2026' రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వివరాలతో రిజిస్ట్రేషన్ (వన్​ టైమ్​ రిజిస్ట్రేషన్​) పూర్తి చేయండి.

స్టెప్​ 4- రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, మీ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.

స్టెప్​ 5- దరఖాస్తు ఫారమ్‌ను నింపి, అవసరమైన ఫీజు చెల్లించండి.

స్టెప్​ 6- ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్​ 7- భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని ఒక ప్రింట్ అవుట్ తీసి దగ్గర ఉంచుకోండి.

ప్రస్తుతానికి నోటిఫికేషన్ వాయిదా పడినా, అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ తనిఖీ చేస్తూ ఉండాలని వెల్లడించారు.