యూపీఎస్సీ అభ్యర్థుల కోసం సీనియర్ అధికారులతో ఇంటర్వ్యూ బోర్డు : భట్టి విక్రమార్క

ప్రతిభకు ఆర్థిక ఇబ్బందులు అడ్డురాకూడదనే ఉద్దేశంతో యూపీఎస్సీ ఇంటర్వ్యూలకు ఎంపికైన వారికి ఆర్థికంగా అండగా ఉంటున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. అలాగే ఢిల్లీలో వసతి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.

Published on: Dec 4, 2025, 20:39:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపికైన 50 మంది అభ్యర్థులకు సింగరేణి ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించింది. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, సింగరేణి సీఎండి బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులతో మంత్రులు భట్టి, పొన్నం
యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులతో మంత్రులు భట్టి, పొన్నం

ప్రతిభకు ఆర్థిక ఇబ్బందులు అడ్డురాకూడదనే సంకల్పంతో మెయిన్స్‌కు ఎంపికైన వారికి లక్ష రూపాయలు, ఇంటర్వ్యూకు అర్హత సాధించిన వారికి అదనంగా మరో లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్టుగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అలాగే ఢిల్లీలో వసతి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.

'గతేడాది 20 మంది ఎంపిక కాగా, ఈసారి 50 మంది అర్హత సాధించడం ప్రశంసనీయం. రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య ఎంత పెరిగినా ఎంతమందికైనా ఆర్థిక సాయం అందిచడం జరుగుతుంది. సీనియర్ అధికారులతో ఇంటర్వ్యూ బోర్డు ఏర్పాటు చేయాలని ఇప్పటికే చీఫ్ సెక్రటరీతో చర్చలు జరిపాం.' అని భట్టి విక్రమార్క వెల్లడించారు.

భట్టిని కలిసిన రాజస్థాన్ మంత్రి

అంతకుముందు భట్టి విక్రమార్కను రాజస్థాన్ విద్యుత్ శాఖ మంత్రి హీరాలాల్‌ను ప్రజా భవన్‌లో కలిశారు. తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల విద్యుత్ అవసరాలను తీర్చడానికి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ భాగస్వామ్యంతో చేపట్టనున్న 2,300 మెగావాట్ల ఉమ్మడి విద్యుత్ ప్రాజెక్టులకు (1,500 మెగావాట్ల సౌర, 800 మెగావాట్ల థర్మల్) రాజస్థాన్ క్యాబినెట్ ఆమోదం గురించి చర్చించారు.

క్వాంటం సిటీ

తెలంగాణ ప్రభుత్వం గురువారం హైదరాబాద్‌ను “క్వాంటం సిటీ”గా అభివృద్ధి చేయడానికి ఒక సమగ్ర ప్రణాళికను ఆవిష్కరించింది. క్వాంటం టెక్నాలజీలకు జాతీయ, ప్రపంచ కేంద్రంగా రాష్ట్రాన్ని ఉంచే లక్ష్యంతో భారతదేశపు మొట్టమొదటి దీర్ఘకాలిక క్వాంటం వ్యూహాన్ని ఆవిష్కరించింది. క్వాంటం, తెలంగాణ క్వాంటం స్ట్రాటజీ కోసం నీతి ఆయోగ్ రోడ్‌మ్యాప్‌ను హైదరాబాద్(IIIT-H)లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గచ్చిబౌలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో అధికారికంగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు, అధునాతన డిజిటల్ వ్యవస్థలతో పాటు, క్వాంటం టెక్నాలజీలలో తెలంగాణ ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, సెన్సింగ్, క్రిప్టోగ్రాఫిక్ భద్రతలో అత్యాధునిక పరిశోధనలను ప్రోత్సహించడంతో పాటు, పరిశోధన మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రతా వ్యవస్థలు, లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణ, మానవ మూలధన అభివృద్ధిని బలోపేతం చేయడం ఈ వ్యూహం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More