UPSC Recruitment 2026 : యూపీఎస్సీలో గ్రూప్​-ఏ, బీ ఉద్యోగాలు- రిక్రూట్​మెంట్​ ప్రక్రియ షురూ..

UPSC Recruitment 2026 apply online : కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 105 గ్రూప్-ఏ, గ్రూప్-బీ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 17, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు..

Published on: Jun 28, 2026, 05:31:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న నిరుద్యోగులకు యూపీఎస్సీ తీపి కబురు చెప్పింది. వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో 105 గ్రూప్-ఏ, గ్రూప్-బీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సివిల్ సర్వీసెస్ కాకుండా నేరుగా గ్రూప్-ఏ, గ్రూప్-బీ స్థాయి క్యాడర్ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం! ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ (ఓఆర్​ఏ) పోర్టల్ ద్వారా జూన్ 27, 2026 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. జులై 17, 2026 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చారు.

యూపీఎస్సీ రిక్రూట్​మెంట్​ 2026 అప్డేట్స్..
యూపీఎస్సీ రిక్రూట్​మెంట్​ 2026 అప్డేట్స్..

యూపీఎస్సీ రిక్రూట్​మెంట్​ 2026- ఏయే శాఖల్లో ఖాళీలు ఉన్నాయి?

యూపీఎస్సీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని కీలకమైన మంత్రిత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. వ్యవసాయం, రైతు సంక్షేమం, ఆయుష్, పౌర విమానయానం, కార్పొరేట్ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ, రక్షణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి.

భర్తీ చేయనున్న ప్రధాన పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి:

  • జాయింట్ డైరెక్టర్
  • ఏరోనాటికల్ ఆఫీసర్
  • లీగల్ ఆఫీసర్
  • కంపెనీ ప్రాసిక్యూటర్
  • డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్
  • సివిలియన్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్
  • స్టోర్ ఆఫీసర్
  • సీనియర్ ఫొటోగ్రాఫిక్ ఆఫీసర్, ఫొటోగ్రాఫిక్ ఆఫీసర్
  • మెడికల్ ఆఫీసర్/రిసెర్చ్ ఆఫీసర్ (సిద్ధ)
  • స్పెషలిస్ట్ గ్రేడ్ III (ఆర్థోపెడిక్స్)
  • స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (కార్డియాలజీ, కార్డియోవాస్కులర్, న్యూరాలజీ)

యూపీఎస్సీ రిక్రూట్​మెంట్​ 2026- అర్హతలు, ఎంపిక ప్రక్రియ..

ప్రతి పోస్టులకు విడివిడిగా విద్యార్హతలు, వయోపరిమితి, పని అనుభవం వంటి వివరాలను యూపీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు, పే-స్కేల్ (జీతభత్యాలు) వర్తిస్తాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందే నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, తాము ఆయా పోస్టులకు అర్హులో కాదో సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. కొన్ని పోస్టులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉండవచ్చు, మరికొన్ని ఉన్నత స్థాయి పోస్టులకు కేవలం అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉంది.

యూపీఎస్సీ రిక్రూట్​మెంట్​ 2026 నోటిఫికేషన్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యూపీఎస్సీ రిక్రూట్​మెంట్​ 2026- దరఖాస్తు చేసుకునే విధానం..

మొదట యూపీఎస్సీ అధికారిక ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ (ఓఆర్​ఏ) పోర్టల్‌ను సందర్శించాలి.

పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి, లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి.

ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌లో అడిగిన వివరాలను తప్పులు లేకుండా పూరించాలి.

నిర్ణీత ఫార్మాట్‌లో అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

వర్తించే అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్, కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More