Vaibhav Sooryavanshi: ఇండియా ఎ - శ్రీలంక ఎ మధ్య సోమవారం (జూన్ 15) జరిగిన మ్యాచ్ లో ఊహించని హైడ్రామా నడిచింది. ఒక అద్భుతమైన క్రికెట్ మ్యాచ్ గా ముగియాల్సిన ఈ కాంటెస్ట్.. చివరకు ఆటగాళ్ల మధ్య గొడవలు, అంపైర్లతో వాదనలతో ముగిసింది. ఈ వివాదాస్పద గెలుపుతో శ్రీలంక ఎ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కి వెళ్లడమే కాకుండా ఫైనల్ బెర్తుకు మరింత దగ్గరైంది.
Super Over Tension | సూపర్ ఓవర్ కు ముందు తిలక్ వర్మ హంగామా

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ఎ నిర్ణీత ఓవర్లలో 265 రన్స్ చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ కు దిగిన శ్రీలంక ఎ కూడా కరెక్ట్ గా 265 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. అయితే ఆ సమయంలో వెలుతురు మందగించడంతో అసలు సూపర్ ఓవర్ నిర్వహించాలా వద్దా అనే గందరగోళం నెలకొంది.
దీంతో ఇండియా ఎ కెప్టెన్ తిలక్ వర్మ (Tilak Varma) వెంటనే ఫీల్డ్ అంపైర్ల దగ్గరకు వెళ్లి తీవ్రంగా వాదించాడు. సూపర్ ఓవర్ ఖచ్చితంగా జరపాలని గట్టిగా పట్టుబట్టాడు. భారత సపోర్ట్ స్టాఫ్, మిగిలిన ప్లేయర్స్ కూడా కెప్టెన్ కు మద్దతుగా వెళ్లడంతో చాలా సేపు చర్చ నడిచింది. చివరకు అంపైర్లు సూపర్ ఓవర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
No-Ball Controversy | నో-బాల్ వివాదం.. తిలక్ వర్మ అసంతృప్తి
వివాదం అక్కడితో ఆగలేదు. శ్రీలంక ఎ బ్యాటింగ్ చేసిన సూపర్ ఓవర్ ముగిసిన తర్వాత తిలక్ వర్మ మరోసారి అంపైర్లపై ఫైర్ అయ్యాడు. అర్షద్ ఖాన్ వేసిన సూపర్ ఓవర్ లాస్ట్ బాల్ ను అంపైర్లు నడుము కంటే ఎత్తులో వేసిన ఫుల్ టాస్ (Waist-high full toss) గా పరిగణించి 'నో-బాల్' గా డిక్లేర్ చేశారు.
అప్పటికే టీమిండియా ప్లేయర్స్, బ్యాటింగ్ చేయడానికి ప్యాడ్లు కట్టుకుని ఉన్న వైభవ్ సూర్యవంశీ గ్రౌండ్ లోకి వస్తుండగా అంపైర్లు ఈ నిర్ణయం తీసుకోవడం తిలక్ వర్మకు నచ్చలేదు. అతడు మళ్లీ అంపైర్ల దగ్గరకు వెళ్లి సుదీర్ఘంగా చర్చలు జరపడం వల్ల మ్యాచ్ మరింత ఆలస్యమైంది, టెన్షన్ పీక్స్ కి చేరింది.
లంక ప్లేయర్ ను నెట్టేసిన వైభవ్ సూర్యవంశీ!
{{/usCountry}}అప్పటికే టీమిండియా ప్లేయర్స్, బ్యాటింగ్ చేయడానికి ప్యాడ్లు కట్టుకుని ఉన్న వైభవ్ సూర్యవంశీ గ్రౌండ్ లోకి వస్తుండగా అంపైర్లు ఈ నిర్ణయం తీసుకోవడం తిలక్ వర్మకు నచ్చలేదు. అతడు మళ్లీ అంపైర్ల దగ్గరకు వెళ్లి సుదీర్ఘంగా చర్చలు జరపడం వల్ల మ్యాచ్ మరింత ఆలస్యమైంది, టెన్షన్ పీక్స్ కి చేరింది.
లంక ప్లేయర్ ను నెట్టేసిన వైభవ్ సూర్యవంశీ!
{{/usCountry}}అసలైన దారుణమైన సీన్ మ్యాచ్ ముగిసిన తర్వాత వెలుగుచూసింది. సూపర్ ఓవర్ లో తను ఫేస్ చేసిన రెండు బాల్స్ లో కేవలం 5 రన్స్ మాత్రమే చేయడంతో యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) తీవ్ర నిరాశలో ఉన్నాడు.
మ్యాచ్ గెలిచి సెలబ్రేషన్స్ చేసుకుంటున్న శ్రీలంక ఆటగాళ్ల పక్క నుంచి వెళ్తున్న సమయంలో.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఒక లంక ప్లేయర్ ను భుజంతో బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన హోమ్ టీమ్ ప్లేయర్స్ అతన్ని వెనక్కి తోసేశారు. త్వరలోనే ఐర్లాండ్ టీ20 టూర్ తో సీనియర్ ఇండియా టీమ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఈ యంగ్ ప్లేయర్.. లంక ఆటగాళ్లతో దారుణంగా మాటల యుద్ధానికి దిగడం టీవీ విజువల్స్ లో స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
విప్రజ్ నిగమ్ చేసిన తప్పిదం.. భారత్ కు 10 రన్స్ పెనాల్టీ
ఈ మ్యాచ్ లో అంతకుముందు భారత్ ఒక దశలో 143 రన్స్ కే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ టైమ్ లో సుయాన్ష్ శెడ్జ్, విప్రజ్ నిగమ్ లు కలిసి 8వ వికెట్‌కు ఏకంగా 104 పరుగుల పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పి టీమ్ ను కాపాడారు.
కానీ ఈ పార్ట్‌నర్‌షిప్ నడుస్తున్నప్పుడు విప్రజ్ నిగమ్ (Vipraj Nigam) ఒక టెక్నికల్ బ్లండర్ మిస్టేక్ చేశాడు. దీంతో పెనాల్టీ రూపంలో అంపైర్లు ఇండియా ఎ స్కోరు నుంచి ఏకంగా 10 రన్స్ కట్ చేశారు. ఈ 10 పరుగుల పెనాల్టీనే చివరకు మ్యాచ్ ఫలితాన్ని మార్చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. లంక టీమ్ లో సదీర సమరవిక్రమ 93 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కాగా ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ ఎ చేతిలో ఓడిపోయిన భారత్ కు ఇది రెండో ఓటమి.