Vaibhav Suryavanshi Viral Video : తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అతి చిన్న వయసులోనే అందరి దృష్టిని ఆకర్షించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ…! కేవలం బ్యాట్ తోనే కాదు…. ఇప్పుడు తనలోని చిలిపి కోణంతో వార్తల్లో నిలిచాడు.
రూ. 100 ఇస్తారా…?

ఇటీవల వైభవ్ సూర్యవంశీని కలిసేందుకు ఇద్దరు చిన్నారులు వచ్చారు. తమ అభిమాన క్రికెటర్ పక్కన నిలబడి ఫోటో దిగాలని వారు ఆరాటపడ్డారు. అయితే, ఆ సమయంలో వైభవ్ వారితో ఒక ఫన్నీ ప్రాంక్ చేశారు. "మీతో ఫోటో దిగాలంటే ఒక్కో ఫోటోకు వంద రూపాయలు ఇవ్వాలి……. ఇస్తారా?" అని ఎంతో సీరియస్‌గా అడిగారు.
వైభవ్ సరదాగా అడిగిన మాటలను ఆ చిన్నారులు నిజమని నమ్మారు. "అలాగే ఇస్తాం" అంటూ వారు జవాబివ్వడంతో వైభవ్ ఒక్కసారిగా నవ్వేశారు. వారి అమాయకత్వానికి మురిసిపోయిన వైభవ్….. వారితో ఎంతో క్యూట్‌గా ఫోటోలు దిగారు. చిన్నారులతో వైభవ్ వ్యవహరించిన తీరు…. ఆ సమయంలో ఆయన ముఖంలోని చిరునవ్వు అందర్నీ ఆకర్షిస్తున్నాయి.
{{/usCountry}}వైభవ్ సరదాగా అడిగిన మాటలను ఆ చిన్నారులు నిజమని నమ్మారు. "అలాగే ఇస్తాం" అంటూ వారు జవాబివ్వడంతో వైభవ్ ఒక్కసారిగా నవ్వేశారు. వారి అమాయకత్వానికి మురిసిపోయిన వైభవ్….. వారితో ఎంతో క్యూట్‌గా ఫోటోలు దిగారు. చిన్నారులతో వైభవ్ వ్యవహరించిన తీరు…. ఆ సమయంలో ఆయన ముఖంలోని చిరునవ్వు అందర్నీ ఆకర్షిస్తున్నాయి.
{{/usCountry}}ఈ అద్భుతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో… అది కాస్తా క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ సరదా వీడియోను రాజస్థాన్ రాయల్స్ టీమ్.. ఆఫీషియల్ ఎక్స్ ఖాతాలో కూడా పోస్ట్ చేసింది.
వైభవ్ సూర్యవంశీ వినయానికి, ఆయనలోని హ్యూమర్ సెన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. "మైదానంలో ఎంత దూకుడుగా ఉంటారో, బయట అంత సరదాగా ఉన్నారు" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.