ఈ వినాయక చవితికి iPhone 17 Pro కొనాలా? ఇక్కడ భారీ తగ్గింపు..
క్రోమా స్టోర్లలో ఐఫోన్ 17 ప్రో ధరపై ఊహించని రాయితీ లభిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలిపితే కేవలం రూ. 69,990 కే ఈ ప్రీమియం ఫోన్ సొంతం చేసుకోవచ్చు. మరోవైపు ఐఫోన్ 18 ప్రో ప్రీ-బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.
యాపిల్ అభిమానులకు ప్రముఖ డిజిటల్ రిటైల్ సంస్థ 'క్రోమా' మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ప్రకటించింది. మార్కెట్లోకి సరికొత్త ఐఫోన్ 18 ప్రో సిరీస్ అడుగుపెడుతున్న వేళ, ఐఫోన్ 17 ప్రో మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ వినాయక చవితికి మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇదే మంచి ఛాన్స్!

పాత ఫోన్ ఎక్స్ఛేంజ్, బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌లు, బోనస్ ఆఫర్లన్నింటినీ సద్వినియోగం చేసుకుంటే ఐఫోన్ 17 ప్రో (256జీబీ) మోడల్‌ను కేవలం రూ. 69,990 ప్రారంభ ధరకే పొందే వెసులుబాటును కల్పిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోని క్రోమా అవుట్‌లెట్లలో ఈ ఆఫర్లు సందడి చేస్తున్నాయి.
రూ. 69,990కే ఐఫోన్ 17 ప్రో.. ఆఫర్ లెక్క ఇదిగో!
ఈ రూ. 69,990 అనేది నేరుగా తగ్గించిన ఎంఆర్‌పీ ధర కాదు. కస్టమర్లు తమ వద్ద ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం, బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించడం ద్వారా ఈ రేటుకు పొందవచ్చు.
మీ వద్ద ఉన్న ఐఫోన్ 15 ప్రో వర్కింగ్ కండిషన్‌లో ఉంటే, దానికి గరిష్టంగా రూ. 44,500 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ లభిస్తుంది. దీనికి తోడు క్రోమా సంస్థ ప్రత్యేకంగా రూ. 12,000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. అర్హత కలిగిన క్రెడిట్ కార్డులపై రూ. 4,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ టాటా న్యూ కార్డ్ వినియోగదారులకు నిబంధనల ప్రకారం మరో 10 శాతం వరకు అదనపు డిస్కౌంట్ దక్కుతుంది. ఈ ప్రయోజనాలన్నీ వర్తింపజేస్తే ఐఫోన్ 17 ప్రో 256జీబీ వేరియంట్ రూ. 69,990కి, 512జీబీ వేరియంట్ రూ. 88,490కి లభిస్తాయి.
ప్రో మ్యాక్స్ మోడళ్లపై కూడా కళ్లుచెదిరే డీల్స్..
ఈ వినాయక చవితికి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా క్రోమా ఇదే స్థాయి ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ అందిస్తోంది. ఐఫోన్ 15 ప్రో ఎక్స్ఛేంజ్పై గరిష్టంగా రూ. 53,000 వరకు వ్యాల్యూ ఇస్తూ, రూ. 12,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు.
దీనితో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 256జీబీ వేరియంట్ ఆఫర్ల తర్వాత రూ. 74,990 కి లభిస్తుండగా, 512జీబీ మోడల్ రూ. 94,990 ధరలో అందుబాటులోకి వచ్చింది. అయితే నేరుగా ఆన్‌లైన్ (Croma.com)లో కొనుగోలు చేసేవారికి ఈ ఆఫర్ ధరలు వేరుగా ఉంటాయి. సెప్టెంబర్ 15 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్న ఐఫోన్ 17 ప్రో 256జీబీ రూ. 1,26,490 (రూ. 4,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ కలిపి)గా ఉంది. అందుకే భౌతిక స్టోర్లను సందర్శించి పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారానే గరిష్ట ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.
"కస్టమర్లకు కొత్త యాపిల్ ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తూనే, పాత ఫోన్లపై అత్యుత్తమ ఎక్స్ఛేంజ్ విలువ అందించడమే మా లక్ష్యం," అని క్రోమా ప్రతినిధి తెలిపారు.
ఉచిత కేసులు, యాపిల్‌కేర్+ పై ఆకర్షణీయ డిస్కౌంట్..
ఐఫోన్ 17 ప్రో సిరీస్ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికీ రూ. 3,499 విలువైన 'హైఫన్ కేస్ కాంబో'ను ఉచితంగా అందిస్తున్నారు. ఫోన్‌తో పాటు ‘యాపిల్‌కేర్+’ రక్షణ ప్లాన్ తీసుకునే వారికి ఫ్లాట్ 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. రూ. 4,000 క్యాష్‌బ్యాక్‌తో కూడిన 6 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.
ఐఫోన్ 18 ప్రో ప్రీ-బుకింగ్స్ షురూ!
మరోవైపు ఇటీవలే లాంచ్ అయిన యాపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఫోన్ల ప్రీ-ఆర్డర్లను క్రోమా అధికారికంగా ప్రారంభించింది. క్రోమా ఫిజికల్ స్టోర్లలో రూ. 5,000 అడ్వాన్స్ చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. Croma.com, టాటా న్యూ, బిగ్‌బాస్కెట్‌లో మాత్రం పూర్తి నగదు చెల్లించి ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.
ప్రీ-బుకింగ్ చేసుకునే వారికి రూ. 12,000 వరకు తగ్గింపు లభిస్తోంది. వీటితో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 12, ఆపిల్ వాచ్ అల్ట్రా 4, ఎయిర్‌పాడ్స్‌ను కూడా రూ. 2,000 అడ్వాన్స్‌తో స్టోర్లలో ప్రీ-బుక్ చేసుకోవచ్చని క్రోమా యాజమాన్యం వెల్లడించింది.
మరి ఈ వినాయక చవితికి మీరు ఐఫోన్‌ని కొంటున్నారా?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


