iPhone 18 : వ్యూహం మార్చిన యాపిల్! స్టాండర్డ్ ఐఫోన్ 18 లాంచ్ వాయిదా.. ఎందుకు? విడుదల ఎప్పుడు?
ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో అన్ని రకాల ఐఫోన్ మోడళ్లను ఒకేసారి విడుదల చేసే యాపిల్, ఈసారి తన బిజినెస్ స్ట్రాటజీని మార్చేసింది. ఈ పండుగ సీజన్‌లో కేవలం ప్రీమియం మోడళ్లను మాత్రమే మార్కెట్లోకి తెచ్చి, సాధారణ ఐఫోన్ 18 లాంచ్‌ను వాయిదా వేసింది. దీనికి కారణం ఏంటి? మరి స్టాండర్డ్ ఐఫోన్ 18 లాంచ్ ఎప్పుడు?
ప్రతి ఏటా సెప్టెంబర్ వచ్చిందంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాపిల్ లవర్స్ కొత్త ఐఫోన్ సిరీస్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సాధారణంగా బేస్ మోడల్‌తో పాటు ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లను ఒకే వేదికపై ఆవిష్కరించడం యాపిల్ ఆనవాయితీ. అయితే టెక్ దిగ్గజం యాపిల్ తన సుదీర్ఘకాల వ్యూహానికి ఈసారి స్వస్తి పలికింది! తాజాగా జరిగిన ఈవెంట్‌లో కేవలం ప్రీమియం డివైజ్‌లైన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లతో పాటు అత్యంత ఆకర్షణీయమైన ఫోల్డబుల్ ‘ఐఫోన్ డ్యుయో’లపైనే దృష్టి సారించింది. సాధారణ యూజర్లు కొనుగోలు చేసే బేస్/ స్టాండర్డ్ 'ఐఫోన్ 18' వేరియంట్‌ను R ఈవెంట్‌లో విడుదల చేయలేదు.

ఐఫోన్ 18 లాంచ్ ఎప్పుడు?
యాపిల్ లైనప్‌లో తక్కువ ధరలో లభించే బేస్ ఐఫోన్ 18తో పాటు ఐఫోన్ 18ఈ, ఐఫోన్ ఎయిర్ 2 మోడళ్లను వచ్చే ఏడాదే, అంటే 2027 వసంతకాలంలో (మార్చ్) విడుదల చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషణల ప్రకారం.. పండుగ సీజన్‌లో కేవలం ప్రీమియం ఉత్పత్తులపైనే కస్టమర్ల దృష్టి నిలిచేలా చేయడం యాపిల్ వ్యూహం. అటు అమెరికా, యూరప్, ఇటు భారతదేశం వంటి ప్రధాన మార్కెట్లలో ప్రతి ఏటా ఆఖరి త్రైమాసికంలో (క్యూ4) అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదవుతుంటాయి. ఈ సమయంలో ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టే ప్రో, ఫోల్డబుల్ సిరీస్‌ల వ్యాపారాన్ని పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఆ తర్వాత వచ్చే ఏడాది ఆరంభంలో సాధారణ మోడళ్లను తేవడం ద్వారా ఏడాదంతా ఐఫోన్ల విక్రయాల వేగాన్ని సరిసమానంగా కొనసాగించాలని యాపిల్ భావిస్తోంది.
ఇదీ చూడండి : iPhone Duo : యాపిల్ సంచలనం! తొలి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్- ‘డ్యుయో’ ఫీచర్లు, ఇండియాలో ధర..
ఐఫోన్ 18లో ఊహించని ఫీచర్లు!
ఆలస్యంగా వస్తున్నప్పటికీ బేస్ ఐఫోన్ 18 కస్టమర్లను నిరాశపరచదని టెక్ నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ టెక్ పోర్టల్స్ సమాచారం ప్రకారం ఈ మోడల్‌లో అనేక అప్‌గ్రేడ్లు రానున్నాయి:
సరికొత్త ప్రాసెసర్: అత్యంత వేగవంతమైన 2ఎన్ఎం ఏ20 చిప్‌సెట్‌తో పాటు ఎక్కువ ర్యామ్ రానుంది.
డిజైన్ అండ్ మోడెమ్: డిస్‌ప్లేపై చిన్నగా ఉండే డైనమిక్ ఐలాండ్, స్వదేశీ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న యాపిల్ సీ2 మోడెమ్ చిప్‌ను పొందుపరచనున్నారు.
ఐఫోన్ 18ఈ మద్దతు: ధరను అందుబాటులో ఉంచేందుకు కొన్ని డిస్‌ప్లే విడిభాగాలను ఐఫోన్ 18ఈ మోడల్‌తో పంచుకోనున్నట్లు తెలుస్తోంది.
దీనితో పాటు విడుదల కానున్న ఐఫోన్ 18ఈ మోడల్ 9జీబీ ర్యామ్‌తో రానుండగా, ఐఫోన్ ఎయిర్ 2 మోడల్ రెండో కెమెరా, పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటోంది.
ఇదీ చూడండి : iPhone 18 : ఐఫోన్ 18 ప్రో నుంచి ఐఫోన్ డ్యుయో వరకు- యాపిల్ లేటెస్ట్ గ్యాడ్జెట్స్ ఫీచర్లు, ధరలు..
భారతీయ కొనుగోలుదారులపై పడే ప్రభావం..
ఈ మార్పు వల్ల మనదేశంలో బడ్జెట్ పరిమితులు ఉండే ఐఫోన్ ప్రేమికులు కొంతకాలం వేచి చూడాల్సి వస్తుంది. ప్రస్తుతానికి మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐఫోన్ 17 సిరీస్ మోడళ్లను కొనుగోలు చేయడం లేదా ప్రో మోడళ్లకు బడ్జెట్ పెంచుకోవడం మాత్రమే ప్రత్యామ్నాయంగా మారుతుంది.
ఈ వినూత్న నిర్ణయం ద్వారా ఏడాదంతా సేల్స్ చేసుకోవడమే కాకుండా, తన గ్లోబల్ సప్లై చైన్‌పై పడే ఒత్తిడిని సైతం తగ్గించుకోవచ్చని దిగ్గజ యాపిల్ సంస్థ భావిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


