iPhone Duo : యాపిల్ సంచలనం! తొలి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్- ‘డ్యుయో’ ఫీచర్లు, ఇండియాలో ధర..
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ యాపిల్ తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 'ఐఫోన్ డ్యూయో'ను అధికారికంగా ఆవిష్కరించింది. పుస్తకంలా తెరుచుకునే ఈ సంచలనాత్మక డివైజ్ ఫీచర్లు, ఇండియా ధర, ప్రీ-ఆర్డర్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఏళ్ల తరబడి ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది! ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లోకి టెక్ దిగ్గజం యాపిల్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన తొలి మడిచే ఐఫోన్‌ని ‘ఐఫోన్ డ్యూయో’ పేరుతో మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశపెట్టింది. అన్‌ఫోల్డ్ చేసినప్పుడు (తెరిచినప్పుడు) ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్లలోనే అత్యంత పలుచని డిజైన్‌తో దీనిని తీర్చిదిద్దారు. పటిష్టమైన హింజ్ మెకానిజం, చేతిలో పట్టుకోవడానికి అనుకూలమైన డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్, మల్టీటాస్కింగ్ ప్రియులకు కొత్త అనుభూతిని అందించనుంది.

ఈ నేపథ్యంలో ఈ ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో ఫీచర్లు, ధర సహా పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
ఐఫోన్ డ్యుయో- రెండు ఫోన్లలా కాకుండా.. ఒకే పరికరంగా!
"ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోల్డబుల్ ఫోన్లు రెండు వేర్వేరు ఫోన్లను అతికించినట్లుగా ఉంటాయి. అవి యాప్‌లు, వీడియోలు చూడటానికి సరిపోవు," అని యాపిల్ కొత్త సీఈఓ జాన్ టెర్నస్ వ్యాఖ్యానించారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఐఫోన్ డ్యూయో కోసం ప్రత్యేకంగా ఐఓఎస్‌ను రీడిజైన్ చేశామని ఆయన తెలిపారు. దీనివల్ల యూజర్లు రెండు యాప్‌లను పక్కపక్కనే సులభంగా రన్ చేయవచ్చు అని అన్నారు.
అంతేకాకుండా, ఈ డివైజ్ యాపిల్ పెన్సిల్ సపోర్ట్‌తో రావడం విశేషం.
ఐఫోన్ డ్యుయో డిజైన్, డిస్‌ప్లే ప్రత్యేకతలు..
ఐఫోన్ డ్యూయో పుస్తకం తరహాలో తెరుచుకుంటుంది. దీనికి సంబంధించి ముఖ్యమైన డిస్‌ప్లే ఫీచర్లు ఇవే:
ఇన్నర్ డిస్‌ప్లే: ఫోన్ పూర్తిగా తెరిచినప్పుడు 7.6-ఇంచ్ భారీ స్క్రీన్ లభిస్తుంది. ఇది ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ స్క్రీన్ కంటే దాదాపు 50 శాతం పెద్దది.
ఔటర్ డిస్‌ప్లే: ఫోన్ మడిచి ఉన్నప్పుడు వాడుకోవడానికి వెలుపల 5.4-ఇంచ్ స్క్రీన్ ఉంటుంది.
పటిష్టమైన నిర్మాణం: గ్రేడ్ 5 టైటానియంతో పాటు సెరామిక్ ఫైబర్లను ఉపయోగించి దీని ఫ్రేమ్‌ను డిజైన్ చేశారు. ధూళి, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను అందించారు.
రక్షణ: సైడ్ బటన్‌లోనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అమర్చారు.
ఐఫోన్ డ్యుయో- శక్తివంతమైన పెర్ఫార్మెన్స్, కెమెరా..
ఈ ఫోల్డబుల్ ఐఫోన్ ఏ20 ప్రో చిప్‌సెట్ తో పనిచేస్తుంది. దీనివల్ల గేమ్స్, హెవీ యాప్స్ చాలా స్మూత్‌గా నడుస్తాయి. కెమెరా విభాగంలో వెనుకవైపు డ్యూయల్ 48ఎంపీ మెయిన్ కెమెరా సెటప్‌ను అందించారు. రోజంతా అంతరాయం లేకుండా పనిచేసేందుకు 5,400ఎంఏహెచ్ సామర్థ్యం గల డ్యూయల్-బ్యాటరీ వ్యవస్థను ఇందులో పొందుపరిచారు.
ఈ డివైజ్ స్టార్ వైట్, నైట్ స్కై రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఇది 256జీబీ నుంచి ప్రారంభమై గరిష్టంగా 2టబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.
ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో- ధర, లభ్యత వివరాలు..
భారత కరెన్సీ ప్రకారం.. ఈ ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో 256జీబీ వేరియంట్ ధర రూ. 2,99,900. 512జీబీ వేరియంట్ ధర రూ. 3,24,900గా ఉంది. 1టీబీ, 2టీబీ వేరియంట్ల ధరలు వరుసగా రూ. 3,74,900- 4,49,000గా ఉన్నాయి.
ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్లు అక్టోబర్ 16, 2026 (శుక్రవారం)న ప్రారంభమవుతాయి. అక్టోబర్ 23, 2026 నుంచి వినియోగదారులకు ఈ ఐఫోన్ డ్యుయో అందుబాటులోకి వస్తుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. ఐఫోన్ డ్యూయో డిస్‌ప్లే సైజ్ ఎంత?
ఐఫోన్ డ్యూయో లోపలి ప్రధాన డిస్‌ప్లే 7.6 అంగుళాలు కాగా, వెలుపలి స్క్రీన్ 5.4 అంగుళాలు ఉంటుంది.
2. ఐఫోన్ డ్యూయో భారతదేశంలో ఎంత ధరకు లభిస్తుంది?
ఐఫోన్ డ్యూయో ప్రారంభ ధర భారతదేశంలో రూ. 2,99,900 గా నిర్ణయించారు.
3. ఐఫోన్ డ్యూయో ప్రీ-ఆర్డర్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్లు అక్టోబర్ 16, 2026 నుంచి ప్రారంభమై, అక్టోబర్ 23, 2026 నుంచి విక్రయానికి అందుబాటులోకి వస్తాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


