‘ఎంత తాగావ్ బాబు?’- కదులుతున్న కారు డోర్ తీసి రోడ్డు మీద మూత్రవిసర్జన చేసిన వ్యక్తి!
గురుగ్రామ్‌లో సిగ్గుచోటు ఘటన చోటుచేసుకుంది! కదులుతున్న కారులో నుంచి ఓ వ్యక్తి రోడ్డు మీద మూత్రవిసర్జన చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసు కేసు కూడా నమోదైంది.
దేశంలో ‘సివిక్ సెన్స్’పై ఇటీవల ఆందోళనలు వెల్లువెత్తుతున్న తరుణంలో గురుగ్రామ్‌లో ఒక సిగ్గుచేటు ఘటన చోటుచేసుకుంది! ఓ వ్యక్తి.. కదులుతున్న కారు డోర్ ఓపెన్ చేసి రోడ్డు మీద మూత్రవిసర్జన చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అసలేం జరిగింది?
సదరు కారు వెనక వెళుతున్న మరో వాహనంలోని ప్రయాణికుడు ఈ దృశ్యాలను చిత్రీకరించాడు. వీడియోలో ఉన్న మహీంద్రా థార్.. గురుగ్రామ్ సోహ్నా చౌక్ నుంచి శివ్ మూర్తి వైపు ప్రయాణిస్తుండగా సదర్ బజార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
వీడియోలో ముందు ఒక నల్లటి మహీంద్రా థార్ కనిపిస్తోంది. అందులో ఒక తెల్ల చొక్కా ధరించిన వ్యక్తి నిలబడ్డాడు. పక్కనే మరో వ్యక్తి సైకిల్ తొక్కుతున్నట్టు కూడా కనిపిస్తోంది. సైకిల్ తొక్కుతున్న వ్యక్తిని సైతం విస్మరించి, కారులోని సదరు వ్యక్తి ప్యాంటు జిప్పు ఓపెన్ చేసి, రోడ్డు మూత్రవిసర్జన చేయడం మొదలుపెట్టాడు.
ఈ వీడియోకి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఇన్స్టెంట్గా వైరల్ అయ్యాయి.
ఆ మహీంద్రా థార్‌లో మరికొందరు ప్రయాణికులు కూడా ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కారు లోపల మద్యం సీసాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. డ్రైవర్ మద్యం తాగి బండి నడిపాడా? అన్న విషయం తెలియరాలేదు. కానీ కారు నుంచి మూత్రవిసర్జన చేసిన వ్యక్తి మద్యం మత్తులో ఉండే అవకాశం ఉంది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి :
ఎఫ్ఐఆర్ నమోదు..
కారులో నుంచి మూత్రవిసర్జన చేసిన వ్యక్తి వీడియో వైరల్ అయిన అనంతరం ఘటనపై పోలీసులు స్పందించారు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వివరించారు.
“వైరల్ వీడియోని వెరిఫై చేసి ఎస్యూవీ రిజిస్ట్రేషన్ నెంబర్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాము. న్యూ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము. మద్యం తాగి ఈ పని చేశాడా? అన్న దానిపై విచారణ చేస్తున్నాము,” అని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
దుకాణాలు, నివాసాలు ఉన్న రద్దీ ప్రాంతంలో ఆ కారు అతి వేగంగా వెళుతోందని గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు స్థానిక సీసీటీవీ పుటేజీలను చూస్తున్నట్టు స్పష్టం చేశారు.
ఈ ఘటనపై స్థానిక దుకాణదారులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఇది సిగ్గుచేటు మాత్రమే కాదు ప్రజా భద్రతకు ముప్పు,” అని ఒకరు అభిప్రాయపడ్డారు.
“ఇలాంటి ఘటన మళ్లీ జరగకూడదంటే, ఆ వ్యక్తిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి,” అని మరొకరు పేర్కొన్నారు.
భారతీయుల ‘సివిక్ సెన్స్’పై ఇటీవలి కాలంలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు మీద చెత్త పడేయడం దగ్గరి నుంచి, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, ప్రమాదకరంగా రీల్స్ చేస్తుండటం వరకు అనేక విషయాల్లో ప్రజలు దేశం పరువు తీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజా ఘటన సైతం ఈ కోవలోకే చేరింది!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


