...
...
Next Story

Vivo V80 FE : 7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో వివో వీ80 ఎఫ్​ఈ! ఇండియాలో లాంచ్ ఎప్పుడు?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన వీ80 సిరీస్‌లో 'వివో వీ80 ఎఫ్​ఈ' మోడల్‌ను త్వరలో విడుదల చేయనుంది. భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఎరుపు రంగు వేరియంట్‌తో పాటు 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 50ఎంపీ జైస్ కెమెరాలతో ఈ ఫోన్ రానుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Nov 21, 2026, 10:46:33 IST
Advertisement

స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకట్టుకోవడానికి ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో మరో కొత్త మోడల్‌ని రెడీ చేస్తోంది. తమ పాపులర్ వీ80 లైనప్‌లో సరికొత్తగా ‘వివో వీ80 ఎఫ్​ఈ’ ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసేందుకు కంపెనీ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. భారత్‌లో ఈ ఫోన్ అందుబాటుపై వివో ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో ఈ హ్యాండ్‌సెట్ దర్శనమిచ్చింది. దీన్నిబట్టి మన దేశంలోనూ ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. విడుదలకు ముందే భారత వేరియంట్ రంగులకు సంబంధించిన ఆసక్తికర సమాచారం ఆన్‌లైన్‌లో లీక్ అయింది.

వివో వీ80 ఎఫ్​ఈ లీక్స్.. (Representative Image)
వివో వీ80 ఎఫ్​ఈ లీక్స్.. (Representative Image)

ఈ నేపథ్యంలో ఈ వివో వీ80 ఎఫ్​ఈ స్మార్ట్​ఫోన్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో వీ80 ఎఫ్​ఈ- భారత్ కోసమే ప్రత్యేక కలర్​!

ప్యాషనేట్‌గీక్స్ (PassionateGeekz) బ్లాగ్‌లో టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ వెల్లడించిన వివరాల ప్రకారం.. వివో వీ80 ఎఫ్​ఈ త్వరలోనే భారత్‌లో రెడ్ (ఎరుపు), గ్రీన్ (ఆకుపచ్చ) రంగుల్లో విడుదల కానుంది. ఇందులో ఎరుపు రంగు ఫినిష్‌ను కేవలం భారతీయ మార్కెట్ కోసమే ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో ఈ హ్యాండ్‌సెట్ చిల్ గ్రీన్, స్పార్క్​లింగ్ గోల్డ్ షేడ్స్‌లో లిస్ట్ అయింది.

భారత్‌లో విడుదల తేదీని గానీ, రంగుల ఆప్షన్లను గానీ వివో ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సర్టిఫికేషన్ డేటాబేస్‌లో 'V2624' మోడల్ నంబర్‌తో ఈ స్మార్ట్​ఫోన్ కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇతర దేశాల సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు వివో అధికారిక వెబ్‌సైట్‌లోనూ వీ80 ఎఫ్​ఈ వివరాలు ప్రత్యక్షమయ్యాయి. దీనివల్ల ఈ ఫోన్​లో ఉండబోయే కీలక స్పెసిఫికేషన్లు బయటకు వచ్చాయి.

వివో వీ80 ఎఫ్​ఈ- డిస్​ప్లే, ఆపరేటింగ్ సిస్టెమ్..

కెమెరా విభాగంలో వివో తన మార్క్ చూపించబోతోంది. వివో వీ80 ఎఫ్​ఈ వెనుక భాగంలో, ముందు భాగంలో కలిపి మూడు 50-మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఇవ్వనున్నారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్ ఉన్న 50-మెగాపిక్సెల్ జైస్-బ్రాండెడ్ ప్రధాన సెన్సార్‌తో పాటు 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఇందులో ఉంటాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు కూడా 50-మెగాపిక్సెల్ కెమెరాను అందిస్తున్నారు.

బ్యాటరీ సామర్థ్యం విషయంలో ఈ ఫోన్ సరికొత్త బెంచ్‌మార్క్ సృష్టించనుంది. సన్నని డిజైన్‌లోనే ఏకంగా 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇందులో పొందుపరిచారు; దీన్ని వేగంగా ఛార్జ్ చేయడానికి 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. నీరు, ధూళి నుంచి అత్యున్నత రక్షణ కోసం ఐపీ68 + ఐపీ69 రేటింగ్ బిల్డ్‌తో పాటు ఫోన్ వేడెక్కకుండా వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఈ వివో వీ80 ఎఫ్​ఈ అంతర్జాతీయ- ఇండియా లాంచ్ డేట్, ధర వంటి వివరాలపై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks