Vivo X300 Ultra : ఫొటోగ్రఫీ లవర్స్​కి బెస్ట్​ ఈ వివో కొత్త స్మార్ట్​ఫోన్స్​- ఫీచర్స్​, ధర..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో.. తన ఫ్లాగ్‌షిప్ ఎక్స్​300 అల్ట్రా, ఎక్స్​300ఎస్​ ఫోన్లను లాంచ్ చేసింది. జైస్ (Zeiss) అడ్వాన్స్‌డ్ కెమెరా సిస్టమ్, భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్లతో వచ్చిన ఈ ఫోన్లు ఫోటోగ్రఫీ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Published on: Mar 31, 2026, 09:10:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ వివో తన ఎక్స్​300 సిరీస్‌లో రెండు మోడల్స్​ని చైనాలో ఆవిష్కరించింది. వాటి పేర్లు వివో ఎక్స్​300 అల్ట్రా, వివో ఎక్స్​300ఎస్​. ఈ రెండు ఫోన్లు కూడా జైస్ బ్రాండింగ్‌తో కూడిన 200 మెగాపిక్సెల్ కెమెరా వ్యవస్థను కలిగి ఉండటం విశేషం.

వివో ఎక్స్​300 అల్ట్రా..
వివో ఎక్స్​300 అల్ట్రా..

వివో ఎక్స్​300 అల్ట్రా, ఎక్స్​300ఎస్​- ధర, కలర్​ ఆప్షన్స్​..

వివో ఎక్స్​300 అల్ట్రా : ఈ స్మార్ట్​ఫోన్ ప్రారంభ ధర 6,999 యువాన్లు (సుమారు రూ. 95,900). హై-ఎండ్ 16 GB + 1 TB శాటిలైట్ కమ్యూనికేషన్ ఎడిషన్ ధర 8,999 యువాన్లు (సుమారు రూ. 1,23,300). ఇది బ్లాక్, ఫిల్మ్ గ్రీన్, సిల్వర్ టోన్ రంగుల్లో లభిస్తుంది.

వివో ఎక్స్​300ఎస్: దీని బేస్ వేరియంట్ ధర 4,999 యువాన్లు (సుమారు రూ. 68,500) కాగా, టాప్ మోడల్ ధర 6,999 యువాన్లు (సుమారు రూ. 95,900). ఇది డ్రీమ్ కోర్ పర్పుల్, ఫిల్మ్ గ్రీన్, సిల్వర్ టోన్, టైటానియం బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది.

వీటితో పాటు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోసం 'టెలికన్వర్టర్ బండిల్స్', 'ఫొటోగ్రాఫర్ కిట్' వంటి ప్రత్యేక యాక్సెసరీలను కూడా వివో పరిచయం చేసింది.

వివో ఎక్స్​300 అల్ట్రా- ప్రీమియం పవర్‌హౌస్..

వివో ఎక్స్​300 అల్ట్రా స్మార్ట్​ఫోన్ అత్యుత్తమ హార్డ్‌వేర్‌తో వస్తోంది.

డిస్‌ప్లే: 6.82- ఇంచ్ 2కే అమోఎల్​ఈడీ స్క్రీన్, 144 హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

ప్రాసెసర్: అత్యాధునిక 3ఎన్​ఎం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ఇందులో ఉంది.

కెమెరా: వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 200ఎంపీ ప్రధాన కెమెరా, 50ఎంపీ అల్ట్రావైడ్, 200ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇది 3.7ఎక్స్ ఆప్టికల్ జూమ్, 105ఎక్స్ డిజిటల్ జూమ్‌కు మద్దతు ఇస్తుంది.

బ్యాటరీ: 6,600 ఎంఏహెచ్​ బ్యాటరీ, 100డబ్ల్యూ వైర్డ్, 40డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.

ప్రత్యేకత: ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్​ఓఎస్​ 6పై నడుస్తుంది. 3డీ అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

వివో ఎక్స్​300ఎస్​: భారీ బ్యాటరీ, ఫ్లాట్ డిస్‌ప్లే..

ఎక్స్300 అల్ట్రాతో పోలిస్తే ఇది కొన్ని మార్పులతో వస్తోంది.

డిస్‌ప్లే: 6.78- ఇంచ్ 1.5కే అమోఎల్​ఈడీ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ప్రాసెసర్: ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ వాడారు.

కెమెరా: ఇందులో కూడా 200ఎంపీ ప్రధాన కెమెరా ఉంది, కానీ టెలిఫోటో కెమెరా 50ఎంపీగా ఉంటుంది.

బ్యాటరీ: ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 7,100 ఎంఏహెచ్ బ్యాటరీ. ఇది 90డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

లభ్యత: ఈ ఫోన్లు, యాక్సెసరీలు ఏప్రిల్ 3 నుంచి పరిమిత సంఖ్యలో విక్రయానికి అందుబాటులోకి వస్తాయి. ప్రొఫెషనల్ వీడియో ఎక్స్‌పాన్షన్ కిట్ ఏప్రిల్ మధ్యలో విడుదల కానుంది.

వివో ఎక్స్​300 అల్ట్రా, ఎక్స్​300ఎస్ ఇండియా లాంచ్​పై సంస్థ స్పందించాల్సి ఉంది.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. వివో X300 అల్ట్రా, X300s కెమెరాల మధ్య ప్రధాన తేడాలు ఏంటి?

రెండింటిలోనూ జైస్ (Zeiss) బ్రాండింగ్‌తో కూడిన 200MP ప్రధాన కెమెరా ఉన్నప్పటికీ, టెలిఫోటో లెన్స్‌లో మార్పు ఉంది. X300 అల్ట్రాలో అత్యంత శక్తివంతమైన 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంది, ఇది 105x డిజిటల్ జూమ్‌కు మద్దతు ఇస్తుంది. అదే X300s మోడల్‌లో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ మాత్రమే ఉంది, ఇది 100x వరకు డిజిటల్ జూమ్‌ను అందిస్తుంది.

2. ఈ రెండు ఫోన్లలో ఏయే ప్రాసెసర్లను ఉపయోగించారు? పనితీరు ఎలా ఉంటుంది?

వివో X300 అల్ట్రాలో క్వాల్‌కామ్ వారి అత్యంత శక్తివంతమైన Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ను వాడారు, ఇది అత్యుత్తమ గేమింగ్, మల్టీ టాస్కింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఇక వివో X300s లో MediaTek Dimensity 9500 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ రెండు చిప్‌సెట్లు కూడా లేటెస్ట్ 3nm టెక్నాలజీతో వస్తోంది, కాబట్టి బ్యాటరీ వినియోగం తక్కువగా ఉండి పనితీరు వేగంగా ఉంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More