ఇటాలియన్ మూలాలున్న ప్రముఖ ద్విచక్ర వాహన బ్రాండ్ 'వీఎల్ఎఫ్' (వేలోసిఫెరో - Velocifero) భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. దేశంలో ఈ బ్రాండ్ విక్రయాలు, ఆఫ్టర్ సేల్స్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న ‘మోటోహాస్’ సంస్థ.. ‘వీఎల్ఎఫ్ స్ట్రాడా’ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. గతేడాది భారతీయ విపణిలోకి ప్రవేశపెట్టిన 'వీఎల్ఎఫ్ టెన్నిస్' మోడల్ స్థానంలో ఈ నయా ఈ-స్కూటర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ వీఎల్ఎఫ్ స్ట్రాడా ఎలక్ట్రిక్ స్కూటర్‌కి చెందిన విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
వీఎల్ఎఫ్ స్ట్రాడా ఎలక్ట్రిక్ స్కూటర్- రెండు వేరియంట్లలో!
ఈ సరికొత్త 'వీఎల్ఎఫ్ స్ట్రాడా' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ రెండు ప్రధాన వేరియంట్లలో విక్రయిస్తోంది.
స్ట్రాడా సిటీ : రూ. 1,19,999 (ఎక్స్-షోరూమ్)
స్ట్రాడా మ్యాక్స్ : రూ. 1,55,499 (ఎక్స్-షోరూమ్)
కస్టమర్లు రూ. 999 టోకెన్ మొత్తం చెల్లించి సిటీ వేరియంట్‌ని, రూ. 1,999 చెల్లించి మ్యాక్స్ వేరియంట్‌ను అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు! నవంబర్ నెల నుంచి వినియోగదారులకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు ప్రారంభమవుతాయి.
వీఎల్ఎఫ్ స్ట్రాడా ఎలక్ట్రిక్ స్కూటర్- బ్యాటరీ, రేంజ్..
వీఎల్ఎఫ్ స్ట్రాడా ఎలక్ట్రిక్ స్కూటర్‌కి చెందిన రెండు వేరియంట్లలోనూ 6.43 బీహెచ్‌పీ పవర్, 34 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే బీఎల్డిసీ హబ్ మోటార్‌ను అమర్చారు. నీరు, ధూళి నుంచి రక్షణ కల్పించేలా మోటార్, బ్యాటరీ ప్యాక్‌లకు ఐపీ67 రేటింగ్ ఇచ్చారు.
సిటీ వేరియంట్: ఇందులో 2.16 కేడబ్ల్యూహెచ్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఐడీసీ ప్రమాణాల ప్రకారం 130 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. బ్యాటరీని 20 శాతం నుంచి 100 శాతానికి ఛార్జ్ చేయడానికి కేవలం 3 గంటల సమయం పడుతుంది.
మ్యాక్స్ వేరియంట్: ఇందులో రెండు 2.16 కేడబ్ల్యూహెచ్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌లను (మొత్తం 4.32 కేడబ్ల్యూహెచ్) అందించారు. సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 250 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణ రేంజ్‌ని ఇస్తుంది.
{{/usCountry}}మ్యాక్స్ వేరియంట్: ఇందులో రెండు 2.16 కేడబ్ల్యూహెచ్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌లను (మొత్తం 4.32 కేడబ్ల్యూహెచ్) అందించారు. సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 250 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణ రేంజ్‌ని ఇస్తుంది.
{{/usCountry}}ఈ రెండు బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది.
ఈ స్కూటర్‌లో ఈకో, సిటీ, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఈకో మోడ్‌లో గంటకు 45 కి.మీ, సిటీ మోడ్‌లో గంటకు 65 కి.మీ, స్పోర్ట్ మోడ్‌లో గంటకు 85 కి.మీ గరిష్ఠ వేగంతో ప్రయాణించవచ్చు.
వీఎల్ఎఫ్ స్ట్రాడా ఎలక్ట్రిక్ స్కూటర్- కంఫర్ట్ రైడింగ్..
భారతీయ రహదారులపై స్థిరమైన ప్రయాణాన్ని అందించడానికి కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ఒక వినూత్న చక్రాల అమరికను ఇచ్చింది. సాధారణ స్కూటర్లలో 10 నుంచి 14 అంగుళాల చక్రాలు ఉంటాయి, కానీ స్ట్రాడా ముందు భాగంలో 16 అంగుళాల అలాయ్ వీల్, వెనుక భాగంలో 14 అంగుళాల అలాయ్ వీల్‌ను అమర్చారు.
స్కూటర్ సీటు ఎత్తు 780 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 175 ఎంఎంగా ఉంది. సిటీ వేరియంట్ కేవలం 98 కిలోల బరువు మాత్రమే ఉండటం వల్ల నగర రద్దీలో నడపడం అత్యంత సులభం. భద్రత కోసం ముందు వైపు 240 ఎంఎం డిస్క్, వెనుక వైపు 220 ఎంఎం డిస్క్ బ్రేకులతో పాటు కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ (సీబీఎస్) అందించారు.
వీఎల్ఎఫ్ స్ట్రాడా ఎలక్ట్రిక్ స్కూటర్- ఆధునిక ఫీచర్లు..
విఎల్ఎఫ్ స్ట్రాడాలో 5-ఇంచుల టీఎఫ్టీ డిజిటల్ డిస్‌ప్లే, ఆల్-ఎల్‌ఈడీ లైటింగ్, డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, విండ్‌షీల్డ్, కీ-లెస్ స్టార్ట్, రివర్స్ మోడ్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్టులు, లగేజ్ ర్యాక్ వంటి సదుపాయాలను పొందుపరిచారు. కార్బోనియో బ్లాక్, అర్బానో సిల్వర్, టిటానియో గ్రే, లూనా వైట్ అనే నాలుగు రంగుల్లో ఇది లభిస్తుంది.
దేశీయ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, అథర్ కొనార్క్, విడా వీఎక్స్2 మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.
మరి మీరు ఈ వీఎల్ఎఫ్ స్ట్రాడా ఎలక్ట్రిక్ స్కూటర్ని కొంటున్నారా?