పెట్టుబడి లేకుండానే వ్యాపారం: Wకామర్స్ కల్పిస్తున్న వినూత్న అవకాశం
పెట్టుబడి లేకుండా, సరుకులను నిల్వ చేయాల్సిన అవసరం లేకుండానే వ్యాపారం చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ డబ్ల్యుకామర్స్ (Wcommerce) అందిస్తోంది. ఈజీగా వ్యాపారానికి వీలు కల్పిస్తున్న ఈ ప్లాట్‌ఫామ్‌పై దేశవ్యాప్తంగా ఇప్పటికే 22,000కు పైగా ఆన్‌లైన్ స్టోర్‌లు యాక్టివ్‌గా ఉన్నాయి.
హైదరాబాద్, నవంబర్ 17: డిజిటల్ టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో... పెట్టుబడి పెట్టే స్తోమత లేనివారు సైతం వ్యాపారంలో అడుగు పెట్టవచ్చు. సరుకులను నిల్వ చేయాల్సిన అవసరం లేదు. పైసా పెట్టుబడి లేకుండానే వ్యాపారం చేయవచ్చని చెబుతోంది హైదరాబాద్‌కు చెందిన డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ డబ్ల్యుకామర్స్.
పెట్టుబడి లేకుండానే వ్యాపారం: Wకామర్స్ కల్పిస్తున్న వినూత్న అవకాశం (ప్రతీకాత్మక చిత్రం) (Pixabay)
సోషల్ మీడియానే మీ ఆయుధం
చిరు వ్యాపారులు, వ్యక్తులు ఎవరైనా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించి వ్యాపారం ప్రారంభించవచ్చు.
ఆన్‌లైన్ స్టోర్ క్రియేషన్: విక్రేతల పేరుతో కంపెనీ ఒక ప్రత్యేక ఆన్‌లైన్ స్టోర్‌ను క్రియేట్ చేస్తుంది.
ప్రమోషన్ సులువు: విక్రేత చేయాల్సిందల్లా... తమ ఆన్‌లైన్ స్టోర్‌కు సంబంధించిన లింక్/క్యూఆర్ కోడ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లేదా బంధువులు, స్నేహితులకు షేర్ చేయడం.
డెలివరీ, లాభం: కంపెనీ ఆఫర్ చేసే ఉత్పత్తులను ఎవరు కొనుగోలు చేసినా, డెలివరీ బాధ్యతలను కంపెనీయే తీసుకుంటుంది. విక్రేతకు లాభంలో 20 నుంచి 40 శాతం వరకు ఆదాయం వస్తుంది.
దేశవ్యాప్తంగా 22,000 యాక్టివ్ స్టోర్‌లు
‘హెల్త్, వెల్‌నెస్, బ్యూటీ, పర్సనల్ కేర్, హోమ్ ఎసెన్షియల్స్ విభాగాల్లో ఎంపిక చేసిన 40కిపైగా బ్రాండ్స్ నుంచి 600లకుపైగా ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చాం. ఈ బ్రాండ్స్‌కు మార్కెట్లో మంచి పేరు ఉంది’ అని డబ్ల్యుకామర్స్ కో-ఫౌండర్, సీఓఓ శ్రీధర్ శ్రీరామనేని వెల్లడించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 22,000లకుపైగా ఆన్‌లైన్ స్టోర్స్ యాక్టివ్‌గా ఉన్నాయని ఆయన తెలిపారు.
కిరాణా వ్యాపారులు కూడా డబ్ల్యుకామర్స్ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. ‘సోషల్ మీడియా ఇప్పుడు సోషల్ కామర్స్‌గా మారింది. ఈ ప్రస్తుత తరుణంలో ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులకు పెట్టుబడి లేని వ్యాపారానికి ఇది సరైన వేదిక’ అని శ్రీధర్ వివరించారు.
ఈ ప్లాట్‌ఫామ్‌లోని ఉత్పత్తులను ఓఎన్‌డీసీ (Open Network for Digital Commerce) ద్వారా కూడా విక్రయించేందుకు వీలుందని ఆయన తెలిపారు.