సోషల్‌ మీడియాలో ట్వీట్లు తప్ప పని చేసిందేమీ లేదు - కేటీఆర్, హరీశ్ రావుపై కవిత విమర్శలు

బీఆర్ఎస్ నేతలపై కవిత మరోసారి విమర్శనాస్త్రాలను ఎక్కుబెట్టారు.జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ అనుకున్న స్థాయిలో పని చేయలేదన్నారు.కృష్ణార్జునుల్లా సోషల్‌ మీడియాలో గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ లేదంటూ కేటీఆర్, హరీశ్ రావుని టార్గెట్ చేశారు.

Published on: Nov 15, 2025, 13:12:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితాలపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ వాళ్లు సోషల్ మీడియాలో ఉద్యమం చేస్తున్నారు తప్ప గ్రౌండ్ లో చేయలేదన్నారు. అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటేనే… ప్రతిపక్ష పార్టీ ఏ స్థాయిలో పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. కృష్ణార్జునుల్లా(కేటీఆర్ - హరీశ్ రావు) సోషల్‌ మీడియాలో గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ లేదని విమర్శలు గుప్పించారు.

కవిత
కవిత

మరోసారి తీవ్ర విమర్శలు

ఇవాళ మెదక్ లో మీడియాతో మాట్లాడిన కవిత… జూబ్లీహిల్స్‌ ఎన్నికలో కుట్రలు కూడా జరిగాయని వ్యాఖ్యానించారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని చెబుతానని చెప్పారు. ఎన్నికల్లో బీఆర్ఎస్‌ అనుకున్న స్థాయిలో పని చేయలేదనేది స్పష్టంగా కనిపించిందన్నారు. క్షేత్రస్థాయిలో పెద్దగా పని చేయలేదన్నారు. ప్రజల కోరిక మేరకు బీఆర్ఎస్ పోరాడితే… ఫలితం మరోలా ఉండేందని అభిప్రాయపడ్డారు.

“రెడ్డిపల్లిలో 400 ఎకరాల ఫాంహౌస్‌ కట్టారు. ఇందుకోసం రీజినల్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ మార్చారు. దీనివల్ల 56 మంది రైతుల 59 ఎకరాలు పోతున్నాయి.. ఎకరం, అర ఎకరం ఉన్న చిన్న రైతులు నష్టపోతున్నారు. కేటీఆర్, హరీష్ రావు...కేసీఆర్ సార్ కళ్లకు గంతలు కట్టి అరాచకాలు చేసే నాయకులను సేఫ్ గార్డ్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు" అని కవిత కామెంట్స్ చేశారు.

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా కవిత స్పందించారు. "కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన బయటికి వస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది" అని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్‌పై అవాస్తవ ప్రచారం మానుకోవాలని కవిత హితవు పలికారు.

కాంగ్రెస్ పాలనలో మెదక్ జిల్లాలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉందని కవిత విమర్శించారు. రేవంత్ రెడ్డి “యంగ్ ఇండియా స్కూల్” కు శంకుస్థాపన చేసి ఏడాది అవుతుంది కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదన్నారు. ప్రారంభించిన చాలా పనులు అలాగే ఉండిపోయాయని దుయ్యబట్టారు.

ఆసక్తికరమైన ట్వీట్:

శుక్రవారం జూబ్లీహిల్స్​ ఫలితాలు వచ్చిన తర్వాత… జాగృతి అధ్యక్షురాలు కవిత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘కర్మ హిట్స్​బ్యాక్’ అంటూ ‘ఎక్స్‌‌’లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కవిత ట్వీట్ పై నెటిజన్లు కూడా ఎక్కువ సంఖ్యలోనే స్పందించారు. బీఆర్ఎస్‌‌‌‌కు తగిన శాస్తి జరిగిందంటూ కొందరు కవిత ట్వీట్ కు మద్దతు తెలపగా.... కొందరు మాత్రం బీఆర్ఎస్‌‌‌‌కు అనుకూలంగా పోస్టులు చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More