జూబ్లీహిల్స్ ఉపఎన్నిక : ఫలించని ప్రయత్నాలు - బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది..?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. తప్పకుండా గెలుస్తామని భావించిన ఈ ఎన్నికలో భారీ మెజార్టీ తేడాతో ఓడిపోయింది. బాకీ కార్డు, హైడ్రా బుల్డోజర్లు వంటి అంశాలను ప్రధాన అస్త్రాలుగా సంధించినప్పటికీ… సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కారు పార్టీ తేలిపోయింది. అధికార కాంగ్రెస్ పార్టీ చేతిలో భారీ మెజార్టీ తేడాతోనే ఓడిపోయింది. ఈ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళ్లినప్పటికీ…. ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు. ప్రతి రౌండ్ లోనూ హస్తం పార్టీ హవానే కనిపించగా…. బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

బీఆర్ఎస్ ఓటమి - కొన్ని కారణాలు
- మాగంటి గోపినాథ్ మృతితో ఆయన భార్యకే టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రధానంగా సెంటిమెంట్ అస్త్రం కలిసివస్తుందని భావించినప్పటికీ... ఆ పరిస్థితి కనిపించలేదు. పైగా మాగంటి గోపినాథ్ కుటుంబంలోని వివాదాలు కూడా అభ్యర్థి సునీతకు ఇబ్బందిగా మారిన పరిస్థితి కనిపించింది.
- కాంగ్రెస్ బాకీ కార్డు, హైడ్రా బుల్డోజర్లు, పెన్షన్ల వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలను బీఆర్ఎస్ గట్టిగా చేసింది. కానీ ఆశించిన మేరకు ఓటర్లను తమవైపు తిప్పుకోలేకపోయింది.
- పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారంలో పాల్గొనలేదు. అన్నీ వ్యవహారాలు కేటీఆర్ మాత్రమే చూసారు. కేసీఆర్ ప్రచారంలో పాల్గొనకపోవటం కూడా బీఆర్ఎస్ కు మైనస్ అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
- ఉపఎన్నిక ప్రచారంలో ముందంజలో ఉన్న బీఆర్ఎస్.... పోల్ మేనేజ్మెంట్ విషయంలో వెనకబడిపోయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా చివరి 2 రోజుల్లో వెనకపడిపోయినట్లు కనిపించింది. ప్రచారంలో రాష్ట్రస్థాయి నేతలు కీలకంగా ఉన్నప్పటికీ... పోలింగ్ జరిగే నాటికి ఆయా డివిజన్లలో నాయకత్వలేమి సమస్య ఇబ్బందికరంగా మారింది.
- ఎంఐఎం పార్టీ నవీన్ యాదవ్ కు మద్దతు ప్రకటించటం కూడా బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది. మైనార్టీల ఓట్లు ఆశించిన స్థాయిలో రాకుండా కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యాయి.
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ అజహరుద్దీన్ కు కాంగ్రెస్ పార్టీ మంత్రిగా అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం కాంగ్రెస్ కు కలిసివచ్చింది. ఈ పరిణామం ఎంతో కొంత ఉపఎన్నికపై ప్రభావం చూపినట్లు అయింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

