బీఆర్ఎస్ నేతల మాయమాటలు నమ్మకండి - జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి - సీఎం రేవంత్
బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కారు పార్టీని ప్రజలు ఎప్పుడో షెడ్డుకి పంపించారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ మాటల నమ్మవద్దని…. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. శనివారం బోరబండలో నిర్వహించిన కార్నర్ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…నవీన్ యాదవ్ ను అత్యంత భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పారు.

జూబ్లీహిల్ ఓటర్లను తప్పుదోవ పట్టించడానికి రామారావు (కేటీఆర్), హరీష్ రావు ఆటోరిక్షాల్లో తిరుగుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సొంత చెల్లి కవిత అడిగిన ప్రశ్నలకే కేటీఆర్ సమాధానం చెప్పటం లేదని దుయ్యబట్టారు. “ఏ ఆడబిడ్డ సొంత ఇంటి మీద ఆరోపణలు చేయదు. సొంత చెల్లిని పట్టించుకోని వారు.. చిన్నమ్మ బిడ్డలను చూస్తారా.? ఆస్తులు ఇవ్వా్ల్సి వస్తుందని కేటీఆర్ చెల్లిని పక్కనపెట్టాడు” అని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నేతల మాయమాటలు నమ్మవద్దన్నారు.
గతంలో మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్… జూబ్లీహిల్స్ లోని స్థానిక సమస్యలను ఎప్పుడూ పరిష్కరించలేదని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, శిల్పారం వద్ద మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం స్టాల్స్ కేటాయించడం వంటి అనేక మహిళా సాధికారత పథకాలను తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని సీఎం చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులో బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ ను గెలిపించండి - సీఎం రేవంత్
సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లో భాగమైన జూబ్లీహిల్స్ కు కేంద్ర నిధులు తీసుకురాకుండా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్థానిక సమస్యలను లేవనెత్తడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కిషన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ఎందుకు నిధులు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు కనీసం 30 వేల ఓట్ల మెజారిటీ ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని తగిన నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
“బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం గత పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఈ ప్రాంత ఎంపీ కిషన్ రెడ్డి ఢిల్లీ నుండి ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలి. ఇంకా కేటీఆర్ అయితే ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి ని గెలిపియండి అని మొసలి కన్నీరు కారుస్తున్నాడు. గత పదేండ్లు మీరే కదా అధికారంలో ఉంది అప్పుడు గుర్తుకురానీ ఈ ప్రాంతం బిల్లా, రంగాలకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? బోరబండ ప్రజలు మంచోళ్ళు కానీ అమాయకులు కాదు. నవీన్ యాదవ్ ను అత్యంత భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీ అందరిపైన ఉంది” అని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.
"హైదరాబాద్‌లోపి.జనార్దన్‌రెడ్డి మరణిస్తే ఉపఎన్నికలో కేసీఆర్ అభ్యర్థిని నిలబెట్టాడు. అప్పుడు సానుభూతి గుర్తుకు రాలేదా? పీజేఆర్ చేసిన సేవలకు గుర్తుగా బోరబండ కూడలిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తాం. పీజేఆర్‌లా పేద ప్రజలకు సేవ చేయాలంటే నవీన్ యాదవ్‌ను గెలిపించాలి" అని ప్రజలను రేవంత్ రెడ్డి కోరారు.
నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. ఈ ఏడాది జూన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడంతో ఉప ఎన్నిక తప్పనిసరి అనివార్యమైంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

