Weather today : గల్లీ నుంచి దిల్లీ వరకు.. 6 రోజుల పాటు భారీ వర్షాలు- ఐఎండీ అలర్ట్స్..
దేశవ్యాప్తంగా వాతావరణం వేగంగా మారుతోంది. ఏప్రిల్ 6న రాజస్థాన్, బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన తాజా బులిటెన్‌లో దేశంలోని పలు ప్రాంతాలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ 6న రాజస్థాన్, బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో 'ఆరెంజ్ అలర్ట్' ప్రకటించింది. వాయువ్య భారతంపై ఈ వారంలో వాతావరణ ప్రభావం ఉంటుందని, రేపు, ఎల్లుండి వీటి తీవ్రత గరిష్ట స్థాయిలో ఉండవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఏప్రిల్ 7వ తేదీన కాశ్మీర్ లోయలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
గుజరాత్, జమ్ముకశ్మీర్, హరియాణా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని మిగిలిన ప్రాంతాలన్నింటికీ ఐఎండీ 'యెల్లో అలర్ట్' జారీ చేసింది. ఏప్రిల్ 9వ తేదీ వరకు మధ్య, తూర్పు, ద్వీపకల్ప భారతదేశంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ వారం దేశవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉంది.
ఉష్ణోగ్రతల్లో మార్పులు (ఐఎండీ అంచనా)..
వాయువ్య భారతం: ఏప్రిల్ 6న గరిష్ట ఉష్ణోగ్రతలు 2-4°C పెరగవచ్చు; ఏప్రిల్ 7, 8 తేదీల్లో మళ్లీ 2-4°C తగ్గుతాయి. తిరిగి ఏప్రిల్ 9 నుంచి 11 మధ్య 2-4°C పెరుగుతాయి.
తూర్పు భారతం: ఏప్రిల్ 8 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు 3-5°C మేర తగ్గుతాయి. ఆ తర్వాత ఏప్రిల్ 9-11 మధ్య 2-3°C పెరుగుతాయి.
ఐఎండీ అలర్ట్స్- వడగళ్ల వానలు..
ఏప్రిల్ 8: పశ్చిమ మధ్యప్రదేశ్‌లో.
ఏప్రిల్ 7, 8: హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో.
ఏప్రిల్ 6, 8: బీహార్‌లో.
ఏప్రిల్ 8 వరకు: ఝార్ఖండ్‌లో వడగళ్ల వాన పడే అవకాశం ఉంది.
ఐఎండీ అలర్ట్స్- భారీ వర్ష సూచన..
ఏప్రిల్ 7: కాశ్మీర్ లోయలో.
ఏప్రిల్ 6, 8, 9: అరుణాచల్ ప్రదేశ్‌లో.
ఏప్రిల్ 7, 9, 11: అసోం, మేఘాలయలో.
ఏప్రిల్ 8, 9: పశ్చిమ బెంగాల్‌లోని హిమాలయ ప్రాంతం, సిక్కింలో.
ఏప్రిల్ 6: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రాంతీయ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం, గరిష్ట ఉష్ణోగ్రతలు నేడు 2-3°C పెరిగి, 7, 8 తేదీల్లో మళ్లీ 2-4°C తగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాతి 3 రోజుల్లో ఇవి సాధారణం కంటే 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


