వాట్సాప్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్లు.. స్కామ్‌లకు ఇక చెక్
వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత పెంచేందుకు మెటా సంస్థ కీలక సెక్యూరిటీ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. పాస్‌వర్డ్ ఆధారిత టూ-స్టెప్ వెరిఫికేషన్, మల్టిపుల్ పాస్‌కీలు, అపరిచిత నంబర్ల కాల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలిపే సదుపాయాలను పరిచయం చేసింది.
డిజిటల్ యుగంలో వాట్సాప్ వాడకం ఎంత పెరిగిందో.. అదే స్థాయిలో సైబర్ నేరాలు, ఖాతాల హ్యాకింగ్ ఘటనలు తీవ్రమవుతున్నాయి. ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేస్తూ వినియోగదారుల ఖాతాలకు మరింత రక్షణ కల్పించేందుకు మెటా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. పిన్ నంబర్ల స్థానంలో ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్, ఒకే ఖాతాకు బహుళ పాస్‌కీలు, అపరిచిత కాల్స్ వివరాలు ముందే తెలిపే కాలర్ కాంటెక్స్ట్ వంటి అధునాతన సెక్యూరిటీ ఫీచర్లను వాట్సాప్ ఆవిష్కరించింది.

పిన్ స్థానంలో బలమైన పాస్‌వర్డ్
ఇప్పటివరకు వాట్సాప్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్ కోసం ఆరు అంకెల పిన్ (PIN) నంబర్‌ను మాత్రమే ఉపయోగించే వెసులుబాటు ఉండేది. అయితే చాలామంది '123456' లేదా పుట్టిన తేదీల వంటి సులువైన సంఖ్యలను ఎంచుకోవడం వల్ల సైబర్ నేరగాళ్లు సులభంగా ఖాతాలను హ్యాక్ చేసేవారని భద్రతా నిపుణులు హెచ్చరించేవారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, పిన్ స్థానంలో బలమైన ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ కల్పించింది.
ఈ కొత్త విధానంలో కనీసం ఎనిమిది క్యారెక్టర్లతో ఆంగ్ల అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక సంకేతాలు (@, #, $ మొదలైనవి) కలిపి పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఓటీపీ (OTP) చోరీకి గురైనా, ఖాతాను మరొకరు లాగిన్ చేయడం దాదాపు అసాధ్యమవుతుంది. యూజర్లు 'Settings > Account > Password' విభాగానికి వెళ్లి ఈ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవచ్చు.
ఒకే ఖాతాకు బహుళ పాస్‌కీలు (Multiple Passkeys)
వాట్సాప్ మరో కీలక ఫీచర్‌గా మల్టిపుల్ పాస్‌కీల సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల (1 Billion) మందికి పైగా వినియోగదారులు పాస్‌కీలను వాడుతున్నారని సంస్థ తెలిపింది. ఫేస్ ఐడీ, ఫింగర్‌ప్రింట్ లేదా స్క్రీన్ లాక్ ద్వారా యాప్‌లోకి సులభంగా లాగిన్ అయ్యేందుకు ఇది తోడ్పడుతుంది.
ఇప్పటివరకు ఒక పరికరానికే పరిమితమైన పాస్‌కీ సేవలను, ఇప్పుడు ఐఓఎస్ (iOS), ఆండ్రాయిడ్ (Android) రెండు వేర్వేరు డివైజ్లు వాడేవారు ఒకే ఖాతా కోసం వేర్వేరు పాస్‌కీలను క్రియేట్ చేసుకునేలా అప్‌డేట్ చేశారు. దీనివల్ల ఎస్‌ఎంఎస్ ద్వారా వచ్చే ఓటీపీల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. హ్యాకర్లు ఫిషింగ్ దాడికి పాల్పడినా ఈ బయోమెట్రిక్ పాస్‌కీలను దొంగిలించడం కుదరదు. యూజర్లు 'Settings > Account > Passkeys' ద్వారా వీటిని నిర్వహించుకోవచ్చు.
అపరిచిత కాల్స్ వివరాలు ముందే ప్రత్యక్షం
ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. కాంటాక్ట్ లిస్ట్‌లో లేని అపరిచిత వ్యక్తుల నుంచి కాల్ వచ్చినప్పుడు, ఆ ఫోన్ నంబర్ ఏ దేశానికి చెందింది, సదరు వ్యక్తి మీతో ఏవైనా కామన్ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారా అనే వివరాలను స్క్రీన్‌పై ముందే చూపిస్తుంది.
"సైబర్ నేరగాళ్లు హడావుడి వాతావరణాన్ని లేదా అత్యవసర పరిస్థితిని సృష్టించి మోసాలకు పాల్పడుతుంటారు. కాల్ ఎత్తడానికి ముందే ఈ ప్రాథమిక వివరాలు తెలియడం వల్ల యూజర్లు ఒక క్షణం ఆలోచించి అప్రమత్తమయ్యే అవకాశం లభిస్తుంది" అని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు జోసెఫ్ స్టెయిన్‌బెర్గ్ వివరించారు. ఉమ్మడి గ్రూపుల్లో సభ్యులమని చెప్పి మోసం చేసే కేటుగాళ్లను కనిపెట్టడంలో ఈ వివరాలు సహాయపడతాయి.
వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త భద్రతా కొలమానాలు ఖాతాల చోరీని అడ్డుకోవడంలో ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా టూ-స్టెప్ వెరిఫికేషన్ పాస్‌వర్డ్, పాస్‌కీలను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారానికి, డిజిటల్ భద్రతకు తిరుగులేని రక్షణ కల్పించుకోవచ్చని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


