...
...
Next Story

Personal loan ఎప్పుడు తీసుకోకూడదు? ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి..

ఈ మధ్యకాలంలో పర్సనల్​ లోన్​లు చాలా సులభంగా లభిస్తున్నాయి. అందుకే అవసరం ఉన్నా, లేకపోయినా చాలా మంది లోన్​లు తీసుకుంటున్నారు. అయితే ఈ కాలంలో పర్సనల్​ లోన్​ ఎప్పుడు తీసుకోకూడదు అనేది తెలుసుకోవడం చాలా అవసరమైపోయింది. ఇది తెలుసుకుంటే మీ మీద ఆర్థిక భారం తగ్గినట్టే! వివరాల్లోకి వెళితే..

Published on: Nov 8, 2025, 07:30:09 IST
Advertisement

మీకు డబ్బు అవసరం ఉండి, ఆ అవసరాన్ని తక్షణమే తీర్చుకోవాలని అనుకుంటే మీరు సాధారణంగా ఏం చేస్తారు? పర్సనల్​ లోన్​ తీసుకుంటారా? కొన్ని సందర్భాల్లో – ఉదాహరణకు, వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, ఇంటి మరమ్మత్తులు లేదా మీ పిల్లల విద్య కోసం డబ్బు అత్యవసరంగా అవసరమైనప్పుడు.. పర్సనల్​ లోన్​ మంచి ఆప్షన్​ అనిపిస్తుంది. కానీ కేవలం సెలవులకు వెళ్లడానికి మీరు రుణం తీసుకోవాలా? ఇది కొంచెం సందేహాస్పదమైన విషయం. అయితే, చాలా సందర్భాల్లో, అలా చేయకుండా ఉండటమే మంచిది. ఈ నేపథ్యంలో పర్సనల్​ లోన్​ని నివారించడానికి 5 ముఖ్య కారణాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ సందర్భాల్లో పర్సనల్​ లోన్​ తీసుకోకపోవడం ఉత్తమం!

ఈ సందర్భాల్లో పర్సనల్​ లోన్​ తీసుకుంటే చాలా రిస్క్​!
ఈ సందర్భాల్లో పర్సనల్​ లోన్​ తీసుకుంటే చాలా రిస్క్​!

పర్సనల్​ లోన్​ తీసుకునే ముందు వాటికి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలను కూడా పూర్తిగా అర్థం చేసుకోవాలి.

1. అధిక వడ్డీ రేటు

బ్యాంకు మీకు 15 నుంచి 24 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేటుకు పర్సనల్​ లోన్​ ఇస్తుంటే, అది మంచి డీల్ కాదు. అధిక వడ్డీ ఉన్న రుణాలు మొత్తం తిరిగి చెల్లించే మొత్తాన్ని పెంచుతాయి. ఇది ఆర్థికంగా మీకు అధిక భారాన్ని కలిగిస్తుంది.

2. స్థిరమైన ఉద్యోగం లేకపోవడం

మీ ఉద్యోగం అనిశ్చితంగా ఉన్నా లేదా మీకు క్రమరహిత ఆదాయం ఉన్నా.. వ్యక్తిగత రుణం తీసుకోవడం ప్రమాదకరం. ఈఎంఐలు చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోర్ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. అంతేకాకుండా జరిమానాలు , చట్టపరమైన చర్యలకు దారితీయవచ్చు.

3. అధిక అప్పు ఉన్నప్పుడు

మీ రుణం-ఆదాయ నిష్పత్తి 40% కంటే ఎక్కువగా ఉంటే, మరొక రుణం తీసుకోవడం మీకు అదనపు భారం అవుతుంది. గృహ రుణం, కారు లోన్​, క్రెడిట్ కార్డ్ అప్పులతో పాటు వ్యక్తిగత రుణాన్ని నిర్వహించడం ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుంది.

పెళ్లిళ్లు, విహారయాత్రలు, ఖరీదైన గాడ్జెట్‌లు లేదా షాపింగ్ వంటి విలాసాల కోసం పర్సనల్​ లోన్​ తీసుకోవడం అనవసరమైన ఖర్చు. వడ్డీ కారణంగా మీరు చాలా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది! దీనివల్ల ఆ కొనుగోళ్లు మరింత ఖరీదైనవిగా మారుతాయి.

5. స్టాక్ మార్కెట్ లేదా క్రిప్టోలో పెట్టుబడి

అప్పుగా తీసుకున్న డబ్బును స్టాక్ మార్కెట్, క్రిప్టో లేదా ఇతర ప్రమాదకర ఆస్తులలో పెట్టుబడి పెట్టడం భారీ నష్టాలకు దారితీయవచ్చు. మార్కెట్లు కుప్పకూలితే, మీరు డబ్బు కోల్పోతారు. కానీ రుణం మాత్రం వడ్డీతో పాటు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

సురక్షితమైన ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించండి..

వ్యక్తిగత రుణానికి బదులుగా.. తక్కువ వడ్డీ రేటు కోసం గోల్డ్ లోన్, ఫిక్స్​డ్​ డిపాజిట్​లపై లోన్​ లేదా పీపీఎఫ్​పై రుణం వంటి సెక్యూర్డ్ లోన్ ఎంపికలను పరిశీలించండి.

చివరిగా.. ఏదైనా పర్సనల్​ లోన్​తో ముందుకు వెళ్లేముందు, దానితో ముడిపడి ఉన్న ప్రతికూలతలు, సవాళ్లను జాగ్రత్తగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకే, రుణానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా సరైన శ్రద్ధ, సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారుతో చర్చించిన తర్వాతే తీసుకోవాలి.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. పర్సనల్​ లోన్​ తీసుకోవడం రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe