మహిళా రిజర్వేషన్ బిల్లు - ఇది ఒక వర్గం విజయం కాదు, దేశ విజయం: ప్రధాని మోదీ టాప్ కోట్స్

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (ఏప్రిల్ 16, 2026) లోక్‌సభలో ప్రసంగించారు. 'నారీ శక్తి వందన్ అధినియం' (మహిళా రిజర్వేషన్ బిల్లు) గురించి ఆయన చేసిన ప్రసంగంలో ప్రధానాంశాలు ఇక్కడ ఉన్నాయి.

Published on: Apr 16, 2026 4:48 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ 'నారీ శక్తి వందన్ అధినియం' (మహిళా రిజర్వేషన్ బిల్లు) గురించి చేసిన ప్రసంగంల ముఖ్యాంశాలు ఇవీ..

లోక్ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం (Sansad TV )
లోక్ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం (Sansad TV )

1. "ఇది పక్షపాతం కాదు.. నిష్పాక్షికమైన నిర్ణయం"

మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లుల వల్ల ఎవరికీ అన్యాయం జరగదని ప్రధాని హామీ ఇచ్చారు.

"నేను పూర్తి బాధ్యతతో చెబుతున్నాను, ఈ నిర్ణయ ప్రక్రియలో ఎవరికీ వివక్ష ఉండదు. మునుపటి ప్రభుత్వాల సమయంలో ఉన్న సీట్ల నిష్పత్తి అలాగే కొనసాగుతుంది, ఎవరికీ అన్యాయం జరగదు."

2. "ఇది హక్కు, మేము ఇచ్చే భిక్ష కాదు"

మహిళలకు ఈ రిజర్వేషన్లను ఒక 'వరంగా' ఇస్తున్నామని ఎవరూ భ్రమపడవద్దని మోదీ స్పష్టం చేశారు.

"మనం మహిళలకు ఏదో ఇస్తున్నామని భ్రమలో బతకకూడదు. ఇది యుగాలుగా వారికి నిరాకరించబడిన హక్కు. ఆ హక్కును తిరిగి ఇవ్వడం మన బాధ్యత."

3. "క్రెడిట్ నాకు వద్దు.. మీ ఫోటోలే వేయించుకోండి"

ఈ బిల్లు పాస్ అయితే వచ్చే రాజకీయ మైలేజీ లేదా 'క్రెడిట్' గురించి ప్రతిపక్షాలు ఆందోళన చెందవద్దని మోదీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

"ఈ బిల్లు పాస్ అయినందుకు క్రెడిట్ తీసుకోవడానికి మీకు 'బ్లాంక్ చెక్' ఇస్తున్నాను. నాకు ఏ గుర్తింపు వద్దు. బిల్లు ఆమోదం పొందిన మరుసటి రోజు.. మీకు ఎవరి ఫోటో కావాలంటే వారి ఫోటోతో ఫుల్ పేజీ అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తాను."

4. "వ్యతిరేకించే వారిని మహిళలు క్షమించరు"

మహిళా రిజర్వేషన్లకు అడ్డంకులు సృష్టించే వారిపై ప్రధాని ఘాటు హెచ్చరికలు చేశారు.

"మహిళల హక్కులకు వ్యతిరేకంగా నిలబడిన వారిని ఈ దేశ మహిళలు ఎప్పటికీ మర్చిపోరు, క్షమించరు. వారి హక్కులను అడ్డుకున్న ఏ పార్టీని మహిళలు వదిలిపెట్టలేదు."

5. "దేశానికి కొత్త దిశానిర్దేశం"

21వ శతాబ్దంలో భారత్ కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తోందని, ఈ చట్టం దేశ శాసనవ్యవస్థను మరింత సున్నితంగా మారుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక పార్టీ విజయం కాదని, మొత్తం దేశం సాధించే ఉమ్మడి విజయం అని ఆయన పేర్కొన్నారు.

గమనించాల్సిన ఇతర బిల్లులు:

ఈ ప్రత్యేక సమావేశాల్లో (ఏప్రిల్ 16 - 18) మహిళా రిజర్వేషన్‌తో పాటు మరో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టారు:

వీటిపై తుది నిర్ణయం ఏప్రిల్ 17 (శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు వెలువడనుంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More