...
...
Next Story

OTT: ఓటీటీ ట్రెండింగ్ టాప్ 2లో రొమాంటిక్ డ్రామా- 30 ఏళ్ల ప్రతి మగాడు చూడాల్సిన సినిమా- 7.7 రేటింగ్- హత్తుకునే సీన్లు!

OTT Trending Romantic Drama Movie 29: ఓటీటీలో తమిళ రొమాంటిక్ డ్రామా మూవీ దూసుకుపోతోంది. తెలుగులో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా టాప్ 2 స్థానంలో ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. 30 ఏళ్ల ప్రతి మగాడు చూడాల్సిన సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ రొమాంటిక్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 8, 2026, 15:52:50 IST
Advertisement
<p>చిత్రం 29 ఓటీటీ రిలీజ్ అయిన వెంటనే ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ సినిమా కథ మిమ్మల్ని ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. మిమ్మల్ని ఎమోషనల్ చేసే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమా పేరుకు రొమాంటిక్ కథ అయినా అంతకుమించి ఆకట్టుకుంటుంది.</p>

చిత్రం 29 ఓటీటీ రిలీజ్ అయిన వెంటనే ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ సినిమా కథ మిమ్మల్ని ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. మిమ్మల్ని ఎమోషనల్ చేసే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమా పేరుకు రొమాంటిక్ కథ అయినా అంతకుమించి ఆకట్టుకుంటుంది.

29 ఏళ్ల సత్య చుట్టూ ఈ సినిమా సాగుతుంది. అతను 29 సంవత్సరాల వయస్సు దాటి 30 ఏళ్లలోకి అడుగుపెడుతుంటాడు. ఈ వయస్సులో అతను సామాజిక నిబంధనల ప్రకారం కెరీర్‌లో సెట్ అవ్వాలి, కానీ, సత్య తనదైన గుర్తింపును తెచ్చుకోలేకపోతాడు.

ఈ సామాజిక ఒత్తిళ్లు, కుటుంబ సభ్యుల ప్రశ్నల మధ్య సత్య ఎలాంటి ఇబ్బందులు పడ్డాడనేది దర్శకుడు చాలా సహజంగా చూపించారు. తరచూ ఉద్యోగాలు మార్చడం, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడంతో తనలో తానే కుంగిపోతుంటాడు. నేటి తరం యువత అనుభవిస్తున్న క్వార్టర్ లైఫ్ క్రైసిస్‌ను ఈ పాత్ర ప్రతిబింబిస్తుంది.

సత్య జీవితంలో తీవ్ర గందరగోళం నడుస్తున్న సమయంలో విజీ (ప్రీతి అస్రాని) అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. సత్యలా కాకుండా విజీ తన కెరీర్, భవిష్యత్తుపై ఎంతో స్పష్టమైన ఆశయాలతో ఉంటుంది. వీరిద్దరి మధ్య చిగురించిన పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది.

అయితే, సత్యలో ఉన్న అభద్రతాభావం, జీవితంపై ఉన్న సందిగ్ధత వీరి బంధాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయనేదే మిగతా కథ. సినిమాల్లో చూపించే అవాస్తవిక ప్రేమకథల్లా కాకుండా, నిజ జీవితంలో భాగస్వాముల మధ్య వచ్చే ఆలోచనా భేదాలను ఇందులో చాలా పరిణతితో చర్చించారు.

"ఒక మహిళ మానసికంగా కథకు కనెక్ట్ కాలేకపోతే, ఆ ప్రేమకథకు విలువే లేదు" అని ఒక ఇంటర్వ్యూలో స్క్రిప్ట్ మార్పుల గురించి దర్శకుడు రత్నకుమార్ వెల్లడించారు. అందుకు తగ్గట్లే ప్రీతి అస్రాని పోషించిన విజీ పాత్ర సినిమాకు బలమైన పట్టును ఇచ్చింది.

విధు తన నటనతో సత్య పాత్రలోని అమాయకత్వాన్ని, బాధను అద్భుతంగా పండించగా.. ప్రీతి అస్రాని తన నటనతో కట్టిపడేసింది. వీటికి తోడు షాన్ రోల్డాన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. డైలాగ్స్‌లలో సహజత్వం, ఎమోషనల్ సీన్స్ వీక్షకులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మన పక్కింటి అబ్బాయి కథలా అనిపించే ఈ '29' చిత్రాన్ని ప్రతి ఒక్క 30 ఏళ్ల మగాడు కచ్చితంగా చూడాల్సిందే.

ప్రముఖ దర్శకుడు రత్నకుమార్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందించిన ఈ తమిళ చిత్రం థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుని, జూన్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా 29 సినిమా ఓటీటీ రిలీజ్ అయింది. డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన రోజు నుంచే ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది ఈ సినిమా. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ 2 స్థానంలో అదరగొడుతోంది. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో 10కి 7.7 రేటింగ్ ఉంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe