...
...
Next Story

TTD Food Analysis Lab : ఇక కల్తీకి చెక్..! తిరుమలలో ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ ప్రారంభం - ప్రత్యేకతలివే

TTD Food Analysis Lab : తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ అందుబాటులోకి వచ్చింది. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ల్యాబ్ ను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన విశేషాలను ఇక్కడ తెలుసుకోండి…

Published on: Mar 21, 2026 12:59 PM IST
Advertisement
<p>తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ అందుబాటులోకి వచ్చింది. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ల్యాబ్ ను ప్రారంభించారు.</p>

తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ అందుబాటులోకి వచ్చింది. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ల్యాబ్ ను ప్రారంభించారు.

శ్రీవారి భక్తుల నమ్మకానికి భరోసా కల్పిస్తూ, తిరుమల పవిత్ర ప్రసాదాల స్వచ్ఛతను కాపాడేందుకు ఈ అత్యాధునిక ‘స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ’ను ఏర్పాటు చేశారు.

దేశంలోని ఏ పుణ్యక్షేత్రంలోనూ లేని విధంగా ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) తో కుదిరిన ఒప్పందం మేరకు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది.

సుమారు రూ. 25 కోట్ల వ్యయంతో, 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ పరిశోధనశాల ద్వారా లడ్డూ, అన్న ప్రసాదాల తయారీలో వాడే నెయ్యి, నూనె, పాలు, ఇతర ముడిసరకుల్లో అత్యంత సూక్ష్మ స్థాయిలో కల్తీ జరిగినా వెనువెంటనే గుర్తించే అవకాశం ఉంటుంది.

ఫ్రాన్స్ నుంచి రాబోతున్న 'ఈ-నోస్', 'ఈ-టంగ్' వంటి అత్యాధునిక యంత్రాలు ఆహార పదార్థాల వాసన, రుచిలోని స్వల్ప తేడాలను కూడా పసిగడతాయి. గరిష్టంగా ఒక్కో నమూనాపై 50 రకాల పరీక్షలు చేసేలా ఇక్కడ సౌకర్యాలు కల్పించారు.

కేంద్ర ప్రభుత్వ నిధులు, టీటీడీ సహకారంతో ఏర్పడిన ఈ ల్యాబ్.. ప్రసాదాల నాణ్యత విషయంలో భక్తులకు పూర్తి స్థాయి భరోసా కల్పించనుంది

తిరుమలలోని టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ భక్తులకు సురక్షితమైన నీరు మరియు ఆహారాన్ని అందించేందుకు వివిధ వనరుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ ల్యాబ్‌లో 6,000 చదరపు అడుగులు రసాయనాల విశ్లేషణకు, మరో 6,000 చదరపు అడుగులు మైక్రో బయాలాజికల్ విశ్లేషణకు కేటాయించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe