...
...
Next Story

స్మార్ట్​ఫోన్లు, స్మార్ట్​ టీవీలు, స్మార్ట్​ ఫ్రిడ్జ్​లు- అమెజాన్​లో ఈ గ్యాడ్జెట్స్​పై అదిరే ఆఫర్లు..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్​ సేల్ 2026 లైవ్ అయ్యింది. స్మార్ట్​ఫోన్లు, స్మార్ట్​ టీవీలు, ల్యాప్​టాప్​లు, ఫ్రిడ్జ్​లపై కళ్లు చెదిరే ఆఫర్లు లభిస్తున్నాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Oct 8, 2026, 11:21:07 IST
Advertisement
<p>యాపిల్ మ్యాక్​బుక్ నియో వాస్తవ ధర రూ. రూ. 79,900. కానీ అమెజాన్ సేల్​లో ఇది రూ. 71,900కే లభిస్తుంది. ఇక డెల్ 15 వాస్తవ ధర రూ. 99,478తో పోల్చితే సేల్​లో రూ. 73,990కి వస్తోంది. మరోవైపు హెచ్​పీ 15 ల్యాప్​టాప్​.. ఆఫర్లు, డిస్కౌంట్ల అనంతరం రూ. 71,300కి లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ. 90,035</p>

యాపిల్ మ్యాక్​బుక్ నియో వాస్తవ ధర రూ. రూ. 79,900. కానీ అమెజాన్ సేల్​లో ఇది రూ. 71,900కే లభిస్తుంది. ఇక డెల్ 15 వాస్తవ ధర రూ. 99,478తో పోల్చితే సేల్​లో రూ. 73,990కి వస్తోంది. మరోవైపు హెచ్​పీ 15 ల్యాప్​టాప్​.. ఆఫర్లు, డిస్కౌంట్ల అనంతరం రూ. 71,300కి లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ. 90,035

ఇక స్మార్ట్ టీవీలపైనా అదిరే ఆఫర్లు లభిస్తున్నాయి. రూ. 99,950గా ఉండే టీసీఎల్ 4కే స్మార్ట్​ ఎల్​ఈడీ 65 ఇంచ్​ టీవీ ఇప్పుడు రూ. 57,999కే లభిస్తుండటం విశేషం. షావోమీ క్యూఎల్​ఈడీ టీవీ ఎక్స్​ ప్రో 7 ఇంచ్​ వాస్తవ ధర రూ. 1,19,999 కాగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్​ సేల్​ 2026లో ఇది రూ. 69,999కే వస్తోంది. శాంసంగ్ 75 ఇంచ్ క్రిస్టల్ యూహెచ్​డీ 4కే విజన్ ఏఐ టీవీని రూ. 88,990కి కొనుగోలు చేవచ్చు. దీని వాస్తవ ధర రూ. 1,19,999.

రూ. 1,15,490 ధరతో ఉన్న గోద్రేజ్ 600ఎల్​ 3 స్టార్ స్మార్ట్​ కన్వర్టెబుల్ సైడ్ బై సైడ్ రిఫ్రిజరేటర్.. ఇప్పుడు రూ. 68,900కే లభిస్తుంది. మరోవైపు హ.యర్ 520ఎల్ 3 స్టార్ సైడ్ బై సైడ్ రిఫ్రిజరేటర్ వాస్తవ ధర రూ. 1,55,090. కానీ ఇది రూ. 81,990కే వస్తోంది. రూ. 1,22,900 వరకు ఉండే ఎల్​జీ 655ఎల్ 3 స్టార్ సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్​ని అమెజాన్ సేల్​లో రూ. 76,990కే కొనుగోలు చేయవచ్చు.

ఇక స్మార్ట్​ఫోన్స్​ విషయానికొస్తే.. ఐఫోన్ 16ని ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్​ సేల్​లో రూ. 71,999కే కొనుగోలు చేయవచ్చు. ఐక్యూ నియో 10ని రూ. 41,999కి దక్కించుకోవచ్చు. రూ. 1,29,999 విలువ చేసే శాంసంగ్ గెలాక్సీ ఎస్​25 అల్ట్రా మోడల్​ని రూ. 84,999కి పొందొచ్చు. ఇతర స్మార్ట్​ఫోన్స్​పై ఉన్న డీల్స్​ని తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రైమ్ వినియోగదారులకు ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్డివల్​ సేల్ అక్టోబర్​ 7న అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 8న అందరికి లైవ్ అయ్యింది. అయితే ఈ సేల్ ఎండ్​ డేట్​ని సంస్థ ఇంకా ప్రకటించలేదు. దీపావళి వరకు ఇది కొనసాగే అవకాశం ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks