...
...
Next Story

Anasuya: ఫస్ట్ టెడ్ టాక్ ఆనందం.. చీరలో చందమామలా అనసూయ.. అవి అందమైన జ్ఞాపకాలు అంటూ పోస్ట్.. ఫొటోలు వైరల్

Anasuya: ఒకప్పటి బుల్లితెర యాంకర్ గా అదరగొట్టిన అనసూ.. ఇప్పుడు వర్సటైల్ యాక్టింగ్ తో వెండి తెరపై వెలిగిపోతోంది. తన సక్సెస్ స్టోరీని టెడ్ టాక్ లో ఫస్ట్ టైమ్ పంచుకుంది. ఆ అనుభవాలు చెప్తూ చీరలో చందమామలా మెరిసిపోతున్న ఫొటోలను అనసూయ పోస్టు చేసింది. మీరూ ఓ లుక్కేయండి.

Published on: Jul 8, 2026, 12:25:45 IST
Advertisement
<p>సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్లు ప్లే చేస్తూ దూసుకుపోతోంది అనసూయ భరద్వాజ్. తాజాగా చీరలో ఇలా మెరిసిపోయింది. </p>

సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్లు ప్లే చేస్తూ దూసుకుపోతోంది అనసూయ భరద్వాజ్. తాజాగా చీరలో ఇలా మెరిసిపోయింది.

రీసెంట్ గా టెడ్ టాక్ లో అనసూయ పార్టిసిపేట్ చేసింది, తన సక్సెస్ స్టోరీని అందరితో షేర్ చేసుకుంది.

వివిధ రంగాలకు చెందిన సక్సెస్ ఫుల్ పర్సన్స్ తమ సక్సెస్ స్టోరీని షేర్ చేసే వేదికే టెడ్ టాక్. తాజాగా ఐఎంటీ హైదరాబాద్ లో జరిగిన టెడ్ టాక్ లో అనసూయ తన స్టోరీ చెప్పింది.

ఈ ఈవెంట్ కోసం ఇలా చీరలో రెడీ అయింది అనసూయ. తన టెడ్ టాక్ అనుభవాన్ని ఇన్ స్టాలో పంచుకుంటూ ఇవాళ (జూలై 8) ఈ ఫొటోలు పోస్టు చేసింది.

**అచీవ్‌మెంట్ అన్‌లాక్డ్: నా మొదటి TEDx టాక్. ఆ ఐకానిక్ రెడ్ సర్కిల్ మీద నిలబడి, నేను బలంగా నమ్మే ఒక ఆలోచనను అందరితో పంచుకున్న ఆ క్షణాన్ని తలచుకుంటే ఇప్పటికీ నా ముఖంపై చిరునవ్వు వస్తూనే ఉంది’’ అని ఈ పోస్టుకు క్యాప్షన్ గా రాసుకొచ్చింది అనసూయ.

‘‘కొన్ని మైలురాళ్లు కేవలం విజయాలు మాత్రమే కాదు.. మనం ఎంత దూరం ప్రయాణించి వచ్చామో గుర్తుచేసే అందమైన జ్ఞాపకాలు.. అలాగే భవిష్యత్తులో మనం ఇంకా ఏమేం సాధించగలమో తెలియజేసే మృదువైన ప్రోత్సాహకాలు’’ అంటూ ఈ పోస్టుకు అనసూయ క్యాప్షన్ ఇచ్చింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe