...
...
Next Story

యాపిల్ ఎయిర్​ట్యాగ్​కి పోటీగా Google Pixel Tag.. ఇండియాలో లాంచ్- ఫీచర్లు, ధర..

యాపిల్ ఎయిర్‌ట్యాగ్‌కు పోటీగా గూగుల్ తన మొదటి బ్లూటూత్ ట్రాకర్ 'పిక్సెల్ ట్యాగ్'ను భారత్‌లో లాంచ్ చేసింది. రూ. 3,799 ప్రారంభ ధరతో వస్తున్న ఈ ట్యాగ్ ఫీచర్లు, లభ్యత వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 13, 2026, 12:20:26 IST
Advertisement
<p>ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. మార్కెట్లోకి సరికొత్త ప్రొడక్ట్‌ను తీసుకువచ్చింది. యాపిల్ ఎయిర్‌ట్యాగ్‌కు గట్టి పోటీ ఇచ్చేలా గూగుల్ తన మొట్టమొదటి బ్లూటూత్ ట్రాకర్ ‘పిక్సెల్ ట్యాగ్’ని అధికారికంగా ప్రకటించింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ట్యాగ్ విడుదల అయింది.</p>

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. మార్కెట్లోకి సరికొత్త ప్రొడక్ట్‌ను తీసుకువచ్చింది. యాపిల్ ఎయిర్‌ట్యాగ్‌కు గట్టి పోటీ ఇచ్చేలా గూగుల్ తన మొట్టమొదటి బ్లూటూత్ ట్రాకర్ ‘పిక్సెల్ ట్యాగ్’ని అధికారికంగా ప్రకటించింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ట్యాగ్ విడుదల అయింది.

ఈ ఏడాది చివర్లో గూగుల్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఈ పరికరం అమ్మకాలకు రానుంది. అయితే దీనికి సంబంధించిన ధరలు, పూర్తి ఫీచర్లను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. భారత్‌లో ఈ ట్రాకర్‌ను విడిగా లేదా నాలుగు ట్యాగ్‌ల ప్యాక్‌గా కొనుగోలు చేయవచ్చు. ఇది చూడటానికి పెబుల్ ఆకారంలో ఉండి, ముందు భాగంలో ఎల్‌ఈడీ ఇండికేటర్, గూగుల్ బ్రాండింగ్‌ను కలిగి ఉంది.

భారత మార్కెట్లో సింగిల్ పిక్సెల్ ట్యాగ్ ధర రూ. 3,799 నుంచి ప్రారంభమవుతుంది. ఇక నాలుగు ట్యాగ్‌ల ప్యాక్ ధరను రూ. 12,900గా నిర్ణయించారు. ఈ ఏడాది నవంబర్‌లో గూగుల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఈ ట్రాకర్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇది సింగిల్ ‘ఫాగ్’ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది.

ఖచ్చితమైన లొకేషన్ ట్రేసింగ్ కోసం గూగుల్ తొలి బ్లూటూత్ ట్రాకర్‌లో బ్లూటూత్ ఛానెల్ సౌండింగ్, అల్ట్రా-వైడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అమర్చారు. ‘ఫైండ్ హబ్’ సాయంతో వినియోగదారులు డైరెక్షనల్ గైడెన్స్ ద్వారా ఈ పిక్సెల్ ట్యాగ్‌ను సులభంగా వెతకొచ్చు. అలాగే గూగుల్ పిక్సెల్ డివైజ్‌ల మధ్య ఫాస్ట్ పేర్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ట్రాకర్‌లో బిల్ట్-ఇన్ స్పీకర్ ఉంది. పిక్సెల్ డివైజ్‌లోని ఫైండ్ హబ్ యాప్ ద్వారా రిమోట్‌గా అలారమ్‌ను మోగించి పరికరాన్ని సులభంగా కనుగొనవచ్చు. అంతేకాకుండా, ఈ ట్యాగ్‌పై ఒక బటన్ ఉంటుంది. దీనిని నొక్కడం ద్వారా పోగొట్టుకున్న ఫోన్‌ను కూడా రింగ్ చేయవచ్చు. ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నప్పటికీ ఈ ట్యాగ్ ద్వారా రింగ్ చేయగానే అలారం మోగుతుంది!

వినియోగదారులు తమ గూగుల్ పిక్సెల్ డివైజ్ సాయంతో జెమినీని అడిగి కూడా పిక్సెల్ ట్యాగ్‌ను రింగ్ చేయమని చెప్పవచ్చు. ఈ బ్లూటూత్ ట్రాకర్‌లో మార్చుకోవడానికి వీలయ్యే సీఆర్2032 కాయిన్ సెల్ బ్యాటరీని ఇచ్చారు. ఇది ఏడాదికి పైగా వస్తుందని కంపెనీ చెబుతోంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఇది ఐపీ67 రేటింగ్‌ను కలిగి ఉంది. నీటిలో ఒక మీటర్ లోతు వరకు 30 నిమిషాల పాటు ఇది తట్టుకోగలదని తెలిపారు. ఆండ్రాయిడ్ 9, ఆ తర్వాత వెర్షన్లపై పనిచేసే అన్ని డివైజ్‌లతో ఇది అనుకూలంగా ఉంటుంది. ఇందులో యాక్సిలరోమీటర్ ఉండగా, పాలికార్బోనేట్, మెటల్ బాడీతో దీన్ని తయారు చేశారు. ఈ ట్రాకర్‌పై కంపెనీ ఒక ఏడాది వారంటీ ఇస్తోంది. దీని పరిమాణం 28x46.1x5.4 ఎంఎం ఉండగా, బరువు సుమారు 11.8 గ్రాములుగా ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe