...
...
Next Story

మంచి జీతంతో బెల్‌లో ఉద్యోగాలు.. ఆన్‌లైన్ దరఖాస్తుకు మిగిలింది కొన్ని రోజులే!

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌(BEL)లో వివిధ విభాగాల్లో ప్రొబేషనరీ ఇంజినీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే దరఖాస్తు గడువు సమీపిస్తోంది. వెంటనే అప్లై చేయండి.

Published on: Nov 10, 2025, 16:30:08 IST
Advertisement
<p>కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేయాలనుకునేవారికి భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ అవకాశం కల్పిస్తోంది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల అయింది. 340 పోస్టులను భర్తీ చేస్తున్నారు. బీఈ, బీటెక్‌ పూర్తిచేసిన వారు అప్లై చేసుకోవాలి.</p>

కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేయాలనుకునేవారికి భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ అవకాశం కల్పిస్తోంది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల అయింది. 340 పోస్టులను భర్తీ చేస్తున్నారు. బీఈ, బీటెక్‌ పూర్తిచేసిన వారు అప్లై చేసుకోవాలి.

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. ఎంపికైనవారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్టాణక, తమిళనాడు, మహరాష్ట్ర, హర్యానా, ఉత్తరాఖండ్‌లో పనిచేసేందుకు రెడీగా ఉండాలి. ఎలక్ట్రానిక్స్‌-175, కంప్యూటర్‌ సైన్స్‌-42, మెకానికల్‌-109, ఎలక్ట్రికల్‌ 14 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఈడబ్ల్యూఎస్‌కు 34, అన్‌రిజర్వుడ్‌ 139, ఓబీసీ-ఎన్‌సీఎల్‌ 91, ఎస్సీ 51, ఎస్టీ 25 పోస్టులు కేటాయించారు.

నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా విద్యార్హతలు ఉండాలి. వయసు 2025, అక్టోబర్‌ 1 నాటికి 25 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ-ఎన్‌సీఎల్‌కు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వేతనం నెలకు రూ.40 వేల నుంచి రూ.1.4 లక్షల వరకు వస్తుంది. దరఖాస్తు ఫీజు రూ.1180, ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఎలాంటి ఫీజు ఉండదు. www.bel-india.in వెబ్‌సైట్‌‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 14గా నిర్ణయించారు. వెంటనే అప్లై చేయాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe