ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు హస్తప్రయోగం చేసుకోవచ్చా?
ప్రెగ్నెన్సీ చుట్టూ చాలా సందేహాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా గర్భం సమయంలో సెక్స్, హస్తప్రయోగంపై ఎక్కువ డౌట్స్ వస్తుంటాయి. మరి గర్భం దాల్చిన సమయంలో మహిళ హస్తప్రయోగం చేసుకోవచ్చా? నిపుణులు ఏమంటున్నారంటే..
గర్భధారణ సమయంలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేనప్పుడు, హస్తప్రయోగం చేసుకోవడం మంచిదే అని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదని వివరిస్తున్నారు. పుట్టబోయే బిడ్డకు ఎలాంటి హానీ జరగదని అంటున్నారు.
ప్రెగ్నెన్సీ అంటేనే చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది. అయితే, హస్త ప్రయోగం కారణంగా గర్భవతుల్లో ఒత్తిడి తగ్గుతుంది. బాగా నిద్ర పడుతుంది.
మరోవైపు, గర్భం చివరి దశ ప్రీమెచ్యూర్ లేబర్ని నివారించేందుకు హస్తప్రయోగం లేదా పెనిట్రేషనల్ సెక్స్‌కి దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
అయితే గర్భవతుల సర్విక్స్ బలహీనపడినప్పుడు, వెజైనల్ బ్లీడింగ్, ప్రీమెచ్య్రూర్ లేబర్ వంటి సందర్భాలు కనిపిస్తున్నప్పుడు హస్తప్రయోగానికి కాస్త దూరంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
హస్త ప్రయోగంలో ఆర్గజం వేళ ప్రెగ్నెంట్ మహిళ పొత్తికడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. కానీ దీనికి భయపడాల్సిన అవసరం లేదు. కొంతసేపటికే నొప్పి తగ్గిపోతుంది.
E-Paper

