...
...
Next Story

ఫొటోలు : గీత కార్మికుడితో ఆత్మీయ సంభాషణ - కల్లు రుచి చూసిన సీఎం చంద్రబాబు

CM Chandrababu Tastes Kallu : కాకినాడ జిల్లా చామవరంలో కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటిని సీఎం చంద్రబాబు సందర్శించారు. స్వయంగా వెళ్లి రూ.4వేల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించారు. కుటుంబంతో కాసేపు ముచ్చటించి వారి యోగక్షేమాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాజా కల్లు రుచిని చూశారు.

Published on: Jun 2, 2026, 07:15:52 IST
Advertisement
<p>కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్వయంగా కల్లుగీత కార్మికుడి ఇంటికి వెళ్లారు. గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు సింహాచలం నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి, ఆయనకు 'ఎన్టీఆర్ భరోసా' పథకం కింద రూ.4 వేల పింఛన్ సొమ్మును స్వయంగా అందజేశారు. కేవలం పింఛన్ ఇవ్వడమే కాకుండా, ఆ కుటుంబంతో కాసేపు ముచ్చటించి వారి యోగక్షేమాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.</p>

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్వయంగా కల్లుగీత కార్మికుడి ఇంటికి వెళ్లారు. గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు సింహాచలం నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి, ఆయనకు 'ఎన్టీఆర్ భరోసా' పథకం కింద రూ.4 వేల పింఛన్ సొమ్మును స్వయంగా అందజేశారు. కేవలం పింఛన్ ఇవ్వడమే కాకుండా, ఆ కుటుంబంతో కాసేపు ముచ్చటించి వారి యోగక్షేమాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.

పింఛన్ డబ్బులు చేతికి అందించిన తర్వాత సింహాచలంతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. "వాలంటీర్లు లేదా అధికారులు ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారా? ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా?" అని సీఎం ఆరా తీశారు. దీనికి సింహాచలం స్పందిస్తూ, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెలా తమ ఇంటికే వచ్చి పెన్షన్ అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కల్లు గీయడం వల్ల నెలకు ఐదు నుంచి ఆరు వేల రూపాయల వరకు మిగులుతుందని, ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న నాలుగు వేల రూపాయల పెన్షన్ తమ కుటుంబ పోషణకు ఎంతో ఆసరాగా నిలుస్తోందని సింహాచలం ముఖ్యమంత్రికి వివరించారు.

కల్లుగీత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. గీత కార్మికులను ఆదుకునేందుకే సబ్సిడీపై మద్యం దుకాణాలను కేటాయించామని చంద్రబాబు గుర్తుచేశారు. అనంతరం సాంప్రదాయ పద్ధతిలో కల్లు గీసే విధానాన్ని ముఖ్యమంత్రి ఆసక్తిగా పరిశీలించారు. తాటిచెట్టుపై నుంచి అప్పుడే తీసిన తాజా కల్లును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుచి చూశారు.

ఈ సంభాషణ సమయంలో సింహాచలం తనకున్న కష్టాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తనకు సొంతిల్లు లేదని, కనీసం తాగునీటి కోసం ట్యాప్ కనెక్షన్ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు తన వృత్తిని, తోటి కార్మికులను కూడా ఆదుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

సింహాచలం విన్నపంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందించారు. సింహాచలానికి వెంటనే ఒక సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలని, అలాగే ఇంటికి తాగునీటి కుళాయి (ట్యాప్ కనెక్షన్) ఏర్పాటు చేయాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు.సింహాచలం కుటుంబానికి మరింత ఆర్థిక వెసులుబాటు కల్పించేలా వారి ఇంట్లో అర్హులకు ఉద్యోగం లేదా ఏదైనా ఉపాధి అవకాశం చూపించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe